Rasi Phalalu In Telugu: ఆగస్టు నెలలోని ఈ కొత్త వారంలో రోజుకు ఒక రాజయోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ వారానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నిజానికి ఆగస్టు 15వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహరాశిలో మూడు గ్రహాలు కలయిక జరగబోతోంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు కూడా రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. మరికొన్ని గ్రహాలైతే తిరోగమనం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన సింహరాశిలోకి సూర్యుడు బుధుడు వెళ్లడం వల్ల బుధాదిత్య రాజయోగం.. అలాగే బుధ, శుక్రుల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాల ప్రభావం మేషరాశి నుంచి మొత్తం 12 రాశుల వారిపై పడబోతోంది దీని కారణంగా జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన చిక్కులనుంచి కూడా విముక్తి లభించనుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏయే రాశుల వారు ఎక్కువగా లాభాలు పొందుతారో తెలుసుకోండి.
మేషరాశి:
ఆగస్టు నెలలోని ఈ కొత్త వారంలో మేష రాశి వారికి ఆశించిన విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అనుకున్న పనులన్నీ తొందరగా జరగబోతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. దీని కారణంగా కుటుంబంలో ఎంతో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసిన ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులయితే గతంలో పెట్టుబడులు పెట్టిన డబ్బులు ఈ సమయంలో రెట్టింపు లాభాలతో పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయం పెట్టుబడులకు కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే గతంలో కుటుంబ సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభించబోతోంది.
వృషభరాశి:
వృషభ రాశి వారికి ఈ ఆగస్టు కొత్త వారంలో చాలా శుభప్రదంగా ఉండబోతోంది. దీని కారణంగా వీరు అదృష్టవంతుల అవ్వబోతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం కలిసి రాబోతోంది. దీని కారణంగా వ్యాపారాలు పూర్తిగా విస్తరిస్తారు. అలాగే శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించి బదిలీలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. దీని కారణంగా వీరు దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరు విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. ఇక రాజకీయ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం కొంత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వంతో కలిసి పని చేసే ఛాన్స్ కూడా లభిస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ ఎంతో తొందరగా జరిగిపోతాయి. మీరు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి లభించి అనుకున్న పనులు వెంటనే పూర్తి చేసి విజయాలు సాధించేందుకు ముందుంటారు. స్నేహితులలో ఒకరు మీకు వారి సపోర్ట్ అందించి, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం కాస్త రిలీఫ్ ఇయ్యబోతోంది. ఉద్యోగాలు చేసే వారికి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. అలాగే మీ బాస్ సపోర్టు లభించి అద్భుతమైన స్కిల్ పొందుతారు. దీంతోపాటు ఈ వారం చివరలో విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యారాశి:
ఈ ఆగస్టు నెలలోని కొత్త వారంలో కన్యా రాశి వారికి కూడా అదృష్టం సహకరించబోతోంది. దీని కారణంగా ఈ వారం వీరు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ పరమైన జీవితంలో వస్తున్న సమస్యలకు కూడా కొంత పరిష్కారం లభించబోతోంది. వృత్తి జీవితం ఈ సమయంలో చాలా బాగుండబోతోంది. అంతే కాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు వాటిల్లో నిమగ్నం అయిపోతారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా పొందే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే వారికి పర్మినెంట్ అయిపోయే అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న అనేక సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం లభించబోతోంది. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొనబోతోంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.