Shani Gochar 2022: అరుదైన యోగాన్ని చేస్తున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Shani Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల షష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 01:22 PM IST
  • కుంభరాశిలో శనిదేవుడి సంచారం
  • షష్ మహాపురుష రాజయోగం
  • ఈ మూడు రాశులకు శుభప్రదం
Shani Gochar 2022: అరుదైన యోగాన్ని చేస్తున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Saturn Planet Gochar In Kumbh Rashi 2022:  జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుని సంచారం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. సాధారణంగా శని దేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి చాలా నెమ్మదిగా వెళతాడు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శనిదేవుడు రాశిని మారుస్తాడు. వచ్చే ఏడాది జనవరిలో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా షష్ మహాపురుష రాజయోగం (Shash Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

కుంభం (Aquarius): షష్ మహాపురుష రాజయోగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో శనిదేవుడు సంచారం చేయబోతున్నాడు. అందుకే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఏదైనా పాత వ్యాధి నుండి బయటపడతారు. మీకు జీవిత భాగస్వామి యెుక్క పూర్తి మద్దతు లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే పనులు మీకు లాభిస్తాయి. మీ బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. 
మేషం (Aries): మీకు షష్ రాజయోగం ఏర్పడడం వల్ల వ్యాపార, వృత్తిలో మంచి పురోగతి సాధిస్తారు. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ టైంలో మీరు మణి రత్నాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది. 
కన్య (Virgo): షష్ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో ఆరో ఇంట్లో ఉండబోతున్నాడు. దీంతో మీకు ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు శత్రువుపై విజయం సాధిస్తారు. పాత వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.

Also Read: December Horoscope: డిసెంబర్ నెలలో మారనున్న ఆ రాశి జాతకం, ఎలా ఉండనుంది 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News