Saturn-Venus conjunction 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే దేవుడిగా శుక్రుడిని భావిస్తారు. ఇతడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు.. వృషభం మరియు తులరాశికి అధిపతి. ఈ గ్రహం గురుగ్రహం ఆధీనంలో ఉన్న మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండి బుధుడు పాలించే కన్యారాశిలో బలహీనంగా ఉంటాడు. అయితే ఈ నెల 22న శుక్రుడు కుంభరాశిలో సంచరించాడు. అప్పటికే శనిదేవుడు అదే రాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత కుంభంలో ఈ రెండు గ్రహాలు కలయిక జరిగింది. అనంతరం శుక్రుడు 15 ఫిబ్రవరి 2023 సాయంత్రం 07:43 వరకు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్లనున్నాడు. అయితే మిత్ర గ్రహాలైన శుక్రుడి, శని కలయిక వల్ల ఏ రాశులవారికి అదృష్టం వరించనుందో తెలుసుకుందాం.
శని-శుక్రుడు కలయిక ఈ రాశులకు తిరుగులేదు ఇక..
మేషం (Aries): శని, శుక్రుల కలయిక మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ సంయోగం మీ పదకొండవ ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా మీరు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ లేదా లాటరీలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం.
వృషభం (Taurus): కుంభంలో శని-శుక్ర సంయోగం ఈ రాశివారికి కలిసి వస్తుంది. వీరి కలయిక మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. ఆఫీసులో మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. శుక్రుడి సంచారం వల్ల మీ సుఖాలు పెరుగుతాయి. లక్ కలిసి వస్తుంది.
మకరం (Capricorn): ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశి వారికి విజయాన్ని ఇస్తుంది. ధనం, సంపదలకు నిలయమైన మీ రాశిలో ద్వితీయ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు వివిధ వనరుల నుండి డబ్బును పొందే అవకాశం ఉంది. పూర్వీకుల లేదా కుటుంబ ఆస్తిని పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థి బలపడుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
Also Read: Grah Gochar 2023: ఫిబ్రవరిలో 3 పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ న్యూస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook