Navpancham Yog In Kundli 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశిని మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈ యోగాల ప్రభావం ప్రజలందరిపైనా కనిపిస్తుంది. తాజాగా కుజుడు మరియు కేతువుల నవపంచమ యోగం, కేతువు మరియు శని యొక్క నవపంచమ యోగం మరియు కుజుడు-శని యొక్క నవపంచమ యోగం ఏర్పడుతున్నాయి. ఈ ట్రిపుల్ నవపంచమ యోగం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
నవపంచం యోగం ఈ రాశులకు వరం
ధనుస్సు రాశిచక్రం:
ట్రిపుల్ నవపంచం యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ సంచార జాతకంలో శనిదేవుడు మూడో ఇంట్లో కూర్చున్నాడు. అలాగే తొమ్మిదవ ఇంట్లో కేతువు బలంగా ఉన్నాడు. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కుంభ రాశి:
ట్రిపుల్ నవపంచం యోగం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని మీ రాశిలో కూర్చున్నాడు. అలాగే కుజుడు శని నుండి ఐదవ స్థానంలో, కేతువు అంగారకుడి నుండి ఐదవ స్థానంలో మరియు శని కేతువు నుండి పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారులు మంచి ఆర్డర్‌లను పొందుతారు. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మిథున రాశిచక్రం:
నవపంచం యోగం మిధున రాశి వారికి లాభాలను ఇస్తుంది.. ఎందుకంటే ఈ యోగం సంచార జాతకంలో త్రికోణ గృహంలో ఏర్పడుతోంది. దీంతో మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Mars Transit 2023: మంగళ గ్రహం గోచారంతో ఈ 5 రాశుల జీవితాల్లో 69 రోజులు తిరుగుండదు
Also Read: MLC Kavitha ED Investigation: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరౌతారా లేదా, ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK