Delhi liquor Scam Case: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరౌతారా..? లేదా, ఏం జరగనుంది..? ఈసారి అరెస్టేనా..?

Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఇవాళ కవిత అరెస్టు తప్పదనే సంకేతాలు గట్టిగా విన్పిస్తున్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 12:18 PM IST
Delhi liquor Scam Case: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరౌతారా..? లేదా, ఏం జరగనుంది..? ఈసారి అరెస్టేనా..?

Delhi liquor Scam Case: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మార్చ్ 16న జరగాల్సిన విచారణ ఇవాళ్టికి వాయిదా పడినా కవిత హాజరుపై ఇంకా సందేహాలు నెలకొన్నాయి. అదే జరిగితే మరి ఈడీ స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. 

ఢిల్లీ మద్యం స్కాంలో ఎమ్మెల్సీ కవిత తొలిసారి మార్చ్ 11వ తేదీన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత రెండవసారి మార్చ్ 16వ తేదీన హాజరుకావల్సి ఉంది. అయితే ఆ రోజు ఆమె హాజరుకాకుండా..తన న్యాయవాదిని పంపించి..వివిధ కారణాలతో హాజరు కాలేనని మరో తేదీ సూచించాలని తెలిపారు. ఈడీ విచారణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటీషన్ విచారణలో ఉండటం, ఈ నెల 24వ తేదీన విచారణకు రానుండటంతో అప్పటి వరకూ హాజరు కాకూడదనే ఉద్దేశ్యంతో కవిత 16వ తేదీ విచారణకు డుమ్మా కొట్టారు. 

మార్చ్ 24 వరకూ విచారణ ఆపాలని ఈడీ అధికారులకు కవిత లేఖ రాశారు. అయినా ఈడీ ఈ నెల 20వ తేదీన అంటే ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపించడంతో ఉత్కంఠ కలుగుతోంది. తన పిటీషన్ అత్యవసరంగా విచారించాలంటూ కవిత చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో ఇవాళ ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. నిన్న సాయంత్రం సోదరుడు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి ఆమె ఢిల్లీకు చేరుకున్నా..ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ఒకవేళ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైతే సాయంత్రానికి ఆమెను అదుపులో తీసుకోవచ్చనే వార్తలు అందుతున్నాయి. అలగాని గైర్హాజరైనా ఈడీ తప్పనిసరిగా అరెస్టు చేయవచ్చని సమాచారం. ఈ క్రమంలో ఇవాళ ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది చాలా ఆసక్తి రేపుతోంది. ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో నిర్ణయం తరువాతే హాజరుకావాలనే నిర్ణయం తీసుకోవచ్చు. లేదా విచారణకు హాజరుకాకపోతే ఈడీ తీసుకునే చర్యల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవచ్చు. 

Also read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News