Shani Margi 2022: వేద జ్యోతిషశాస్త్రంలో న్యాయ దేవతగా పిలువబడే శనిదేవుడు మరో మూడు రోజులలో అంటే అక్టోబరు 23న మకరరాశిలో సంచరించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శనిదేవుడు అదే స్థితిలో ఉంటారు. అదే విధంగా శని అంగారక గ్రహం అయిన ఘృణిత నక్షత్రంలో ఉంటాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, శని మరియు కుజుడు శత్రువులు. వీరిద్దరి వల్ల అశుభయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. శని మార్గం (Shani Margi 2022) కారణంగా ఐదు రాశులవారు శనిమహాదశ నుండి విముక్తి పొందనున్నారు మరియు భారీగా లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మకరం (Capricorn)- ప్రస్తుతం మకరరాశి వారిపై శని సడే సతి కొనసాగుతోంది. శని మార్గి కారణంగా వీరు సడే సతి నుండి ఉపశమనం పొందుతారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమయానికి డబ్బు అందుతుంది. అయినప్పటికీ శనిదేవుడిని పూజించడం వల్ల మీకు లాభాలు కలుగుతాయి.
కుంభం (Aquarius)- కుంభ రాశి వారిపై శని సడే సతి ప్రభావం ఉంటుంది. శని మార్గంలో ఉండటం వల్ల కుంభ రాశి వారికి సమస్యలు తీరుతాయి. దీంతోపాటు శుభఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి (Sagittarius)- ప్రస్తుతం ధనుస్సు రాశిపై శని సడే సతి కొనసాగుతుంది. అక్టోబరు 23న శనిదేవుడు ప్రత్యక్షంగా సంచరించడం వల్ల వీరు దాని నుండి బయటపడతారు. ఉద్యోగులకు నిలిచిపోయిన ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది. కెరీర్ లో గొప్ప పురోగతి ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మిథునం (Gemini)- మిథునరాశి వారిపై శని ధైయా నడుస్తోంది. మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం వల్ల శని ధైయా నుండి బయటపడతారు. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది.
తులారాశి (Libra)- తులారాశి వారిపై శని ధైయా ప్రభావం కూడా ఉంది. శని మార్గంలో ఉన్న వెంటనే తుల రాశి వారికి పెద్ద ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఏ పెద్ద పని అయినా కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
Also Read: Budh Gochar 2022: తులరాశిలో బుధుడి సంచారం.. దీపావళి తర్వాత ఈ రాశులకు భారీ నష్టం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook