Sharad Purnima 2022: శరత్ పౌర్ణమి ప్రత్యేకత..శుభ శుభముహూర్తాలు, శరత్ పౌర్ణమి శుభసమయాలు..

Sharad Purnima 2022: శరత్ పౌర్ణమి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు చంద్రుడు మరింత కాంతివంతంగా కనిపించి.. భూమికి దగ్గరగా వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవికి పూజలు చేస్తే సకల శుభాలు లభిస్తాయని హిందువుల నమ్మకం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 10:09 AM IST
  • శరత్ పౌర్ణమి చాలా ప్రాముఖ్యమైనది.
  • శరత్ పౌర్ణమి ప్రత్యేకత..
  • శుభ శుభముహూర్తాలు
Sharad Purnima 2022: శరత్ పౌర్ణమి ప్రత్యేకత..శుభ శుభముహూర్తాలు, శరత్ పౌర్ణమి శుభసమయాలు..

Sharad Purnima 2022: శరత్ పౌర్ణమి హిందువులకు చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో వస్తుంది. అయితే దీపావళి ముందు వచ్చే పౌర్ణమి ఇదే అత్యంత ముఖ్యమైన పౌర్ణమిగా చెప్పొచ్చు. కాబట్టి హిందువుల్లో చాలామంది ఈరోజు ఉపవాసాలు పాటించి లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి.. మరింత కాంతివంతంగా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చంద్రుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు.

శరత్ పౌర్ణమి శుభసమయాలు:
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అశ్విని మాసం శుక్లపక్షం అక్టోబర్ 9వ తేదీన సాయంత్రం 03:41 మొదలవుతుంది. ఈ పౌర్ణమి ప్రభావం అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 02:25 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ శుభ సమయాలను అనుసరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది.

శరత్ పౌర్ణమి శుభముహూర్తాలు:
బ్రహ్మ ముహూర్తం: ఉదయం: 04:40 నుంచి ఉదయం 05:29 వరకు.
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 31 నిమిషాల వరకు. 
విజయ ముహూర్తం: రాత్రి 2 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషాల వరకు.
సంధ్య ముహూర్తం: రాత్రి 5 గంటల 46 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు.
అమృతకాలం: ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు.
సర్వార్ధ సిద్ది యోగం: ఉదయం 6 గంటల 18 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 21 నిముషాల వరకు..

ఈ సమయాల్లో శుభయోగాలు చేయండి:
రాత్రిపూట లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి గులాబీ మాలలు సమర్పించి.. తీపి పదార్థాలతో కూడిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఈ మంత్రాన్ని కూడా ఉపదేశం చేయండి. "" ఇలా చేయడం వల్ల ఇంట్లో సకల శుభాలు లభించడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 

Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News