Shattila Ekadashi 2023: మాఘ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని శటిల ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అంతేకాకుండా ఇవాళ నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటాయి. ఈ ఏడాది శటిల ఏకాదశి జనవరి 18న జరుపుకోనున్నారు. అయితే రేపు కొన్ని పనులు చేయడం నిషిద్ధం.
శటిల ఏకాదశి శుభ సమయం
పంచాంగం ప్రకారం, శటిల ఏకాదశి యొక్క శుభ సమయం జనవరి 17, 2023న సాయంత్రం 06:04 గంటలకు ప్రారంభమై... జనవరి 18, 2023 సాయంత్రం 04:02 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా జనవరి 18న ఏకాదశిని జరుపుకుంటారు. జనవరి 19 ఉదయం 7 గంటల తర్వాత ఉపవాసాన్ని విరమించండి.
శటిల ఏకాదశి 2023 శుభ యోగం
శటిల ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి, వృద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజు ప్రాధాన్యత మరింత పెరిగింది.
శటిల ఏకాదశి నాడు ఈ పనులు చేయెుద్దు..
1. ఈ రోజు పొరపాటున కూడా వంకాయలు మరియు బియ్యం తినకూడదు.
2. ఇవాళ ఉపవాసం ఉండే వారు మంచం మీద పడుకోకూడదు. అంటే వారు నేలపై విశ్రాంతి తీసుకోవాలి.
3. శటిల ఏకాదశి రోజున మాంసాహారం, మద్యపానం అస్సలు తీసుకోకండి మరియు బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించండి.
4. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. అంతేకాకుండా ఇంటి ముందుకు వచ్చిన నిరుపేద వ్యక్తిని ఖాళీ చేతులతో పంపించకండి.
ఈ రోజున ఈ పనులు చేయండి
** శటిల ఏకాదశి రోజున విష్ణు పురాణం లేదా శ్రీమద్ భగవద్గీత పారాయణంతో పాటు పూజలు మరియు మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది.
** ఈ రోజున పూర్వీకులకు నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.
** దీనితో పాటు ఈ నువ్వుల గింజలతో చేసిన పదార్థాలను సేవించి దానం చేయండి.
Also Read: RajYog: త్వరలో అరుదైన రాజయోగం.. ఈ రాశులకు ఊహించనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Lord Vishnu: రేపే శటిల ఏకాదశి... ఆ రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి..