Canada vs England Hockey Players Fight in CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 మొదలయి వారం రోజులు అవుతోంది. గేమ్స్ అన్ని హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారులు తమ అత్యుత్తమ ఆటతో మెడల్స్ కొల్లగొడుతున్నారు. అయితే మెగా ఈవెంట్‌లోని కొన్ని గేమ్స్ తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే హాకీ మ్యాచులు కూడా సెమీస్ వరకు వచ్చాయి. అయితే హాకీ మ్యాచ్ మధ్యలో కుస్తీ పోటీలు జరిగాయి. అదేంటి హాకీ మ్యాచ్‌లో కుస్తీ పోటీలు ఏంటి అని అనుకుంటున్నారా?.. మరేమీ లేదండి, హాకీ మ్యాచ్‌లో ఓ ఇద్దరు ఆటగాళ్లు గొడవపడ్డారు. రెజ్లర్ల లాగా మైదానంలో పోటీ పడ్డారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా గురువారం పురుషుల హాకీ మ్యాచ్‌లో ఇంగ్లండ్, కెనడా జట్లు తలపడ్డాయి. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ దక్కించుకున్న ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. రెండవ క్వార్టర్ ముగిసే సమయానికి కెనడాపై 4-1 ఆధిక్యం సాధించింది. ఈ సమయంలో ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్టోఫర్ గ్రిఫిత్స్, కెనడాకు చెందిన బాల్‌రాజ్ పనేసర్ గొడవపడ్డారు. గ్రిఫిత్స్ బంతిని తీసుకోవడానికి ప్రయత్నించగా.. పనేసర్ అతడిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హాకీ స్టిక్ గ్రిఫిత్స్ పొట్ట దగ్గరికి వచ్చింది. దీంతో గ్రిఫిత్స్ ఆవేశానికి గురయ్యాడు.
క్రిస్టోఫర్ గ్రిఫిత్స్ ఆవేశంలో బాల్‌రాజ్ పనేసర్ జెర్సీని పట్టుకుని లాగాడు. పనేసర్ కూడా కోపంగా చూస్తూ.. గ్రిఫిత్స్ గొంతును పట్టుకున్నాడు. ఆపై జెర్సీ పట్టుకుని పక్కకు నెట్టుకెళ్లాడు. గొడవ పెద్దదవుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారిని పక్కకు తీసుకెళ్లిపోయారు. మ్యాచ్ మధ్యలోనే గొడవకు దిగిన ఆటగాళ్లపై రెఫరీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనేసర్‌కు రెడ్ కార్డ్ చూపించి.. మ్యాచ్ నుంచి బయటకు పంపాడు. మరోవైపు గ్రిఫిత్స్‌కు కూడా ఎల్లో కార్డు చూపించాడు.
క్రిస్టోఫర్ గ్రిఫిత్స్ ముందుగా జెర్సీ పట్టుకున్నప్పటికీ.. బాల్‌రాజ్ పనేసర్ ఏకంగా గొంతు పట్టుకున్నాడు. ఈ కారణంగా పనేసర్‌కు రెఫరీ రెడ్‌కార్డ్ చూపించి బయటకు పంపించాడు. ఈ గొడవకు ముందు 1-4తో వెనుకబడిన కెనడా చివరికి 2-11తో మరీ దారుణంగా ఓడిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆటగాళ్ల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చరిత్ర సృష్టించిన సుధీర్.. పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook