Giant Snake Video: కారును చుట్టేసిన పెద్ద పాము.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు!

Giant Snake Viral Video, Snake wrapped around the Car. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ పెద్ద పాము కారును పూర్తిగా చుట్టేసింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 5, 2022, 12:51 PM IST
  • కారును చుట్టేసిన పెద్ద పాము
  • ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు
  • వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం
Giant Snake Video: కారును చుట్టేసిన పెద్ద పాము.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు!

Giant Snake wrapped around the Car: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా మనుషులు, జంతువులకు సంబందించిన కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద పాము కారును చుట్టేసింది.

వీడియో ప్రకారం... ఓ అడవిలో రోడ్డు మార్గం ఉంది. రోడ్డు పక్కన చెట్ల మధ్యలో ఓ వాహనం (కారు) ఉంది. చూస్తుంటే ఆ కారు చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ కారును ఏ పెద్ద పాము చుట్టేసింది. అంతపెద్ద కారును ఆ పాము మూడు చుట్లు చుట్టేసింది. కారుకు ముందు భాగంలో తల ఉండగా.. వెనకాల భాగంలో తోక ఉంది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చాలా దగ్గర నుంచి బంధించాడు. దాంతో బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా మంది అరుపులు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో పాము కదలడం లేదు. 

పెద్ద పాముకు సంబంధించిన వీడియోను 'రెక్స్ చాప్‌మన్' అనే ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'మీరు చాలా ఆందోళనగా ఉన్నారా' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ట్విట్టర్‌లో 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. మరోవైపు వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అమ్మో.. ఇది చాలా పెద్ద పాము' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'వ్యాన్‌లో డ్రైవర్ ఉంటే పరిస్థితి ఏంటి' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అయితే చాలా మంది ఇది ఫేక్ అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

Also Read: Panchak In August 2022: ఆగస్టు నెలలో ఈ సమయాల్లో ఎవరైనా మరణిస్తే తప్పకుండా ఇలా చేయాలి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News