Bhai Dooj:చాలామందికి తోబుట్టువుల మధ్య అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ అంటే రాఖీ పండుగ మాత్రమే గుర్తు ఉంటుంది. అయితే తమ తోడబుట్టిన అన్నదమ్ములు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని ఆడపడుచులు చేసే మరొక పండుగ 'భగినీ హస్త భోజనం’. ఈ పండుగను దీపావళి పూర్తయిన రెండవ రోజున.. కార్తీక శుద్ధ విదియనాడు జరుపుతారు. ఈరోజు అన్నదమ్ములు సోదరీ ఇంట్లో ఆమె చేతి భోజనం తింటే సంపూర్ణ ఆయుష్షు కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతాయి.
భగిని అంటే అక్క లేక చెల్లెలు.. అందుకే ఆమె చేతి వంట తినే రోజు కాబట్టి ఈ పండుగకు 'భగినీ హస్త భోజనం’ అనే పేరు వచ్చింది. కావాలనుకున్నప్పుడు తినొచ్చు కదా దీనికోసం మళ్లీ ఒక పండగ చేసుకోవాలా అని భావిస్తున్నారా. ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సూర్యదేవుడికి ,సంధ్యాదేవికి కలిగిన సంతానం యముడు,యమున. తన సోదరుడు అంటే యమున కు ప్రాణం. వివాహం తర్వాత అత్తగారింటికి వెళ్లిన యమున కు అన్నని చూడాలి అనిపించి ఒక రోజు ఇంటికి భోజనానికి రమ్మని కబురు చేస్తుంది. అతనికి ఇష్టమైన భోజనాలు వండి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంత ఎదురు చూసినా యముడు మాత్రం భోజనానికి రాడు. కర్తవ్య పాలన కారణంగా రాలేకపోయాను అని.. కార్తీక శుద్ధ విదియ నాడు తప్పక వస్తానని కబురు పంపి.. అన్న పాట ప్రకారం ఆరోజు చెల్లి ఇంటికి వెళ్తాడు యముడు.
ఇంటికి వచ్చిన అన్నకి అతిధి మర్యాదలు చేసి వండిన పదార్థాలను కొసరి కొసరి తినిపిస్తుంది యమున. దానికి సంతోషించిన యముడు నీకేం కావాలో కోరుకో అని చెల్లిని అడుగుతాడు. “ప్రతి సంవత్సరం నువ్వు ఇదే రకంగా మా ఇంటికి ఈరోజు భోజనానికి రావాలి. అలాగే భూలోకంలో నాలాంటి తోబుట్టువులు తమ అన్నదమ్ములకు ఇదే రకంగా వారింటికి పిలిచి భోజనం పెట్టాలి. ఇలా చేయడం వల్ల వాళ్ల సోదరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి“ అని అడుగుతుంది యమున. అప్పటినుంచి అనాదిగా దీపావళి రెండవ రోజు వచ్చే కార్తీక శుద్ధ విదియనాడు భగినీ హస్త భోజనం ఒక పండుగలా జరుపుకుంటున్నాము. ఈ పండుగను ‘భయ్యా-దుజ్’,‘భాయి-టికా’అని కూడా పిలుస్తారు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి