Sravana Masam 2022: శ్రావణ మాసం జూలై 14, 2022 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో శివుడికి పూజలు చేస్తారు. 2022 శ్రావణ మాసం మూడు రాశులకు అత్యంత శుభదాయకంగా మారనుంది. ఆ మూడు రాశులేవో తెలుసుకుందాం..
హిందూమతం ప్రకారం శ్రావణమాసం శివుడికి సమర్పితం. ఈ నెలకు ముందే విష్ణు భగవానుడు యోగానిద్రలో వెళ్లిపోగా..శివుడు మొత్తం ప్రపంచం నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటుంది. ఈ సందర్భంగా శివభక్తులు..పవిత్ర నదుల నీటితో శివుడికి అభిషేకం చేస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం నాడు వ్రతం ఆచరిస్తారు. శివుడి కటాక్షం కోసం భక్తులు ఈ నెలలో వివిధ రకాల మొక్కులు మొక్కుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసం మూడు రాశులకు అత్యంత లాభదాయకంగా మారి..అంతులేని సంపదను తెచ్చిపెట్టనుంది.
మేషరాశి వారికి ఈ నెల చాలా శుభప్రదం. శివుడి కటాక్షం వల్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి చూస్తారు. ఏదైనా పెద్ద విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి. శ్రావణ సోమవారం నాడు శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మంచి ఫలితాలుంటాయి.
మిధునరాశివారికి ఈ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల అణ్వేషణలో ఉన్నవారికి శివుడి కటాక్షంతో కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. పదోన్నతి కోర్కెలు పూర్తవుతాయి. వ్యాపారులకు కూడా ఈనెల చాలా అనువైనది. శ్రావణమాసంలో వీలైనంత ఎక్కువ సమయం ప్రార్ధనలు చేయండి
మకరరాశివారికి శ్రావణ మాసం చాలా అనువైనది. శివుడి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్ధికపరమైన లాభాలు కలుగుతాయి. కొంతమందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఈ నెలలో జీవిత భాగస్వామితో సహచర్యం బాగుంటుంది. శ్రావణంలో శివుడిని విధి విదానాలతో అభిషేకం చేస్తే లాభాలు చాలా ఉంటాయి.
Also read: Detox Drink: మీ బాడీలో వ్యర్ధాల్ని శుభ్రం చేసే అద్భుతమైన హోమ్ డ్రింక్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.