Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం... ఈ రాశివారు జాగ్రత్తగా ఉండటం అవసరం!

Sun Transit 2022:  ఈ నెల 17న సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కారణంగా ఈ రాశివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 03:53 PM IST
Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం... ఈ రాశివారు జాగ్రత్తగా ఉండటం అవసరం!

Sun Transit 2022:  గ్రహాల రాజు సూర్యభగవానుడు 11 నెలల తర్వాత ఆగస్టు 17న తన ఇల్లు అయిన సింహరాశిలోకి (Sun Transit in leo 2022) చేరుకోనున్నాడు. సూర్యుడు ఏడాదికి ఒకసారి తన సొంత ఇంటికి చేరుకుంటాడు. గ్రహాల రాజు సూర్యదేవుడిని స్వాగతించడానికి యువరాజు బుధుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. 

కర్కాటక రాశిపై  సూర్య సంచార ప్రభావం

సూర్యసంచారం వల్ల కర్కాటక రాశివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్వభావం, ఆలోచన, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందరినీ కలవాలని తహతహలాడకండి. బాగా ఆలోచించి, వారి వ్యక్తిత్వం, స్వభావం తెలుసుకున్న తర్వాత కలవడం మంచిది. ఎందుకంటే మీ గ్రహాలు మిమ్మిల్ని  చెడు వ్యక్తులపై వైపు ఆకర్షించేలా చేస్తాయి. సూర్యుని రాశిలో మార్పు మీ వ్యక్తిగత స్వభావంలో కూడా మార్పు తీసుకువస్తుంది. సూర్యుని మార్పు కారణంగా మీ జాతకంలోని గ్రహాలు మీ స్వభావంలో ప్రతికూల మార్పులను తెస్తాయి.  ఇది సరైనది కాదు.

సూర్య సంచార సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు తలనొప్పి, కళ్ల నొప్పి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం  చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో డబ్బు, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, బంధువులతో ప్రేమగా ఉండండి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: Venus Transit August Effect: కర్కాటకంలో శుక్ర సంచారం... ఈ 3 రాశులవారికి జాక్ పాట్ ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x