Rare Rajyog 2023: కర్కాటక రాశిలో ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు పెరగనున్న సంపద..

Benefits of Trigrahi Yogam: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మార్చడం ద్వారా అరుదైన యోగాలను ఏర్పరుస్తాయి. ఇలాంటి యోగాలలో త్రిగ్రాహి యోగం ఒకటి. త్వరలో ఈ యోగం కర్కాటకరాశిలో ఏర్పడబోతుంది. దీని వల్ల ప్రయోజనం పొందబోతున్న రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 04:09 PM IST
Rare Rajyog 2023: కర్కాటక రాశిలో ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు పెరగనున్న సంపద..

Surya Budh Chandra yuti 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ నెల చివరిలో బుధుడు, సూర్యుడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. దీని వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది.  త్రిగ్రాహి యోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

తులా రాశి
ఈ రాశి యెుక్క కర్మ గృహంలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా మీకు జాబ్ వస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కన్య రాశి
సూర్యుడు, బుధుడు మరియు చంద్రుడు చేస్తున్న త్రిగ్రాహి యోగంతో కన్యారాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఆదాయ గృహంలో ఈ యోగం రూపొందుతుంది. దీంతో మీ ఆదాయం పెరగనుంది. మీకు వివిధ వనరుల ద్వారా డబ్బు అందుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను పొందుతారు. 
మేష రాశి
త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పని లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. 

Also Read: Vakri Guru 2023: గురు తిరోగమనం వల్ల ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News