Surya Gochar in october 2022: ఈనెలలో సూర్యభగవానుడు తన రాశిని మార్చనున్నాడు. అక్టోబరు 17న సూర్యదేవుడు తులరాశిలో (Sun transit in libra 2022) సంచరించనున్నాడు. నవంబరు 16వరకు అంటే దాదాపు నెలరోజులపాటు అక్కడే ఉండనున్నాడు. సూర్య సంచారం ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. సూర్యుడి రాశి మార్పు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తెలుసుకుందాం.
మేషరాశి (Aries): ఈ సూర్య సంచారం వల్ల మేష రాశి వారికి అనేక ఒడిదుడుకులను ఎదుర్కోంటారు. దీంతో ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈసమయం ఈ రాశివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
వృషభం (Taurus): ఈ రాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. వీరి కుటుంబ జీవితం చక్కగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృషభ రాశి వారు బెల్లంతో చేసిన మిఠాయిలను పేదలకు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
మిధునరాశి (Gemini): మిథున రాశి వారు సూర్యుని సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. దీని వల్ల మీ పనులు చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో కూడా ఇబ్బందులు ఎదుర్కోంటారు. మీ కష్టానికి తగ్గ ఫలితాలు రావు. వైవాహిక జీవితంలో గొడవలు రావచ్చు. ఆదివారం నాడు రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దీనిని బయటపడతారు.
కర్కాటకం (Cancer): ఈ రాశి వారు కూడా సూర్య సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు నిపుణుల సలహాను తీసుకోండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
సింహరాశి (Leo): సింహ రాశి వారికి సూర్య సంచారము శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.వ్యక్తిగత జీవితం మరియు కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. పేద ప్రజలకు అన్నం దానం చేయండి.
Also read: Dhanteras 2022: ఈ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు, ఈరోజున యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook