Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!

Thursday Tips: వారంలో గురువారం లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన రోజు. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేయడం వల్ల కష్టాలను తెచ్చుకున్నట్లే అని జోతిష్య శాస్త్రం చెబుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 09:47 AM IST
Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!

Thursday Tips: జ్యోతిషశాస్త్రంలో రోజువారీ ఉపయోగించే పని, సామగ్రితో పాటు కొన్ని నియమాల గురించి వివరించబడింది. ఈ నియమాలను పాటించకపోతే సదరు వ్యక్తి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విధంగా గురువారం రోజున చేయకూడని పనుల గురించి ఇలాంటి కొన్ని నియమాలను పేర్కొంది. ఇంట్లోని పెద్దలు లేదా స్త్రీలు గురువారం రోజున తలస్నానం చేయకూడదని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగో గురువారం తలస్నానంతో పాటు గోళ్లు కూడా కత్తిరించకడదు. దానికి వెనుక కారణం తెలిసిన వారు మనలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఆ నియమాల వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. 

గురువారం రోజున స్త్రీలు తలస్నానం, గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీ దేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది. లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి. 

తలస్నానం చేయోద్దనడానికి కారణం..

జ్యోతిషశాస్త్రంలో గురువారం భర్త, పిల్లల అంశంగా పరిగణిస్తారు. ఆ రోజున స్త్రీలు తలస్నానం చేయడం వల్ల ఆమె జాతకంలో గురుడు బలహీనుడవుతాడు. ఆ ప్రభావం మహిళ భర్త, పిల్లలపై కనిపిస్తోంది. అదే సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించడం వెనుక కారణం ఏమిటంటే.. గురువారం ఇలా చేయడం వల్ల డబ్బు నష్టం వస్తుంది. అలాగే వ్యక్తి ఆర్థిక పరిస్థితి కూడా బలహీనపడుతుంది.

గురువారం ఉపశమన ఆలోచనలు

- పైన పేర్కొన్న పనులకు గురువారం దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఇలా చేయడం మానుకోవాలి.

- బృహస్పతి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ రోజు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి (గురుడు) బలపడతాడు.

- గురువారం రోజున పూజ సమయంలో విష్ణువుకు పసుపు రంగు వస్తువును సమర్పించండి. అలాగే అరటిపండును ప్రసాదంగా సమర్పించండి. 

Also Read: Venus Transit: మేషరాశిలోకి శుక్రుడు, ఆ ఐదు రాశులకు మహర్దశే మరి

Also Read: Spiritual Importance of Thursday: గురువారం వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News