Venus Transit 2023 Dates, Time And Predictions: వేద జ్యోతిషశాస్త్రంలో అన్ని నవ గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి గ్రహం మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల అన్నింటిలో శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు ప్రతి ఒక్కరికి భౌతిక సౌకర్యాలను అందిస్తాడు. ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో.. వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆనందం, ఐశ్వర్యం, వైభవం మరియు విలాసాలను పొందుతారు. వృషభం మరియు తుల రాశికి అధిపతిగా శుక్రుడు పరిగణించబడ్డాడు.
శుక్రుడు ఆడపిల్లకు మెరుగైన లాభాలను ఇవ్వడని చెబుతారు. శుక్రుడు ఏ రాశిలో సంచరించినా.. దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శుక్రుడు ఏ రాశిలోకి అయితే సంచరిస్తాడో ఆ రాశి వారికి గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడు ఈ సంవత్సరం ఎన్నిసార్లు సంచారం చేస్తాడో, ఏ రాశి వారికి ఏ నెల అనువుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
శుక్ర సంచారం తేదీలు:
22 జనవరి 2023 - మకరం నుంచి కుంభ రాశికి ప్రయాణం
15 ఫిబ్రవరి 2023 - కుంభం నుంచి మీన రాశికి సంచారం
మార్చి 12 2023 - మీనం నుంచి మేష రాశికి ప్రయాణం
ఏప్రిల్ 6 2023 - మేషం నుంచి వృషభ రాశికి సంచారం
మే 2 2023 - వృషభం నుంచి మిధున రాశికి ప్రయాణం
మే 30 2023 - మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచారం
జూలై 7 2023 - కర్కాటకం నుంచి సింహ రాశికి ప్రయాణం
అక్టోబర్ 2 2023 - కర్కాటకం నుంచి సింహ రాశికి సంచారం
3 నవంబర్ 2023 - సింహ రాశి నుంచి కన్యా రాశికి ప్రయాణం
30 నవంబర్ 2023 - కన్యా రాశి నుంచి తులా రాశికి సంచారం
డిసెంబర్ 5, 2023 - తులా రాశి నుంచి వృశ్చిక రాశికి ప్రయాణం
Also Read: Randeep Hooda Accident: బాలీవుడ్ హీరోకి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు! శస్త్రచికిత్స అవసరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.