Asia Cup 2022: దుబాయ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. సర్ఫింగ్ చేస్తూ..వాలీబాల్ ఆడుతున్నారు. తర్వాతి మ్యాచ్‌కు మరింత సమయం ఉండటంతో ఫుల్ టైపాస్ చేస్తున్నారు. దుబాయ్ బీచ్‌లో భారత ఆటగాళ్ల విన్యాసాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం వీడియో ట్రెడింగ్‌లో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లు బ్రేక్ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్ సర్ఫింగ్ చేశారు. కోహ్లీ, దినేష్ కార్తీక్, అశ్విన్, రాహుల్, హార్దిక్ పాండ్యాతోపాటు ఇతర ఆటగాళ్లు బీచ్‌లో వాలీబాద్ ఆడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో భారత్ దూసుకెళ్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి..సూపర్-4కు చేరింది. టోర్నీలో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టడంతో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండో మ్యాచ్‌లో హాంగాకాంగ్‌ను మట్టికరిపించింది. 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈనెల 4న సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ లేదా హాంకాంగ్‌తో భారత్ తలపడుతుంది. ఇవాళ పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈమ్యాచ్‌లో గెలిచిన జట్టుతో టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 6న ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈనెల 8న భారత్, అఫ్ఘనిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
When #TeamIndia hit 𝗨.𝗡.𝗪.𝗜.𝗡.𝗗! 👏
Time for some surf, sand & beach volley! 😎#AsiaCup2022 pic.twitter.com/cm3znX7Ll4
— BCCI (@BCCI) September 2, 2022
Also read:Chandrababu: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయబోతున్నాయా..చంద్రబాబు ఏమన్నారంటే..!
Also read:Asia Cup 2022: నాగిని డ్యాన్స్‌ను అదరగొట్టిన లంక ప్లేయర్..వీడియో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి