Asia Cup 2022: ఆసియా కప్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నేటితో గ్రూప్ దశ ముగియనుంది. రేపటి నుంచి సూపర్-4 ప్రారంభంకానుంది. నిన్నటి బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్‌లో లంక గెలుపుబావుట ఎగురవేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. సాధారణంగా బంగ్లాదేశ్ జట్టు గెలిస్తే..ఆ దేశ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేయడం మనం చూశాం. మ్యాచ్‌లో కీలక వికెట్ పడినా స్టెప్పులు ఉండాల్సిందే.
ఐతే ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఏది కలిసి రాలేదు. రెండు మ్యాచ్‌ల్లో ఓడి..టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. ఉత్కంఠ పోరులో బంగ్లాపై శ్రీలంక విజయం సాధించింది. ఈక్రమంలోనే ఆ జట్టు ప్లేయర్ చమిక కరుణరత్నెతోపాటు ఆ దేశ అభిమానులు నాగిని డ్యాన్స్ చేశారు. బంగ్లాదేశ్‌కు కౌంటర్ స్టెప్పులు వేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.
యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతోంది. గ్రూప్ బీ నుంచి అఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు సూపర్-4కు చేరాయి. రెండు మ్యాచ్‌లు ఓడి బంగ్లాదేశ్ ఇంటి దారి పట్టింది. సూపర్-4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. చివరి వరకు పోరాడి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన లంక జట్టు 19.2 ఓవర్లలో 184 పరుగులు చేసి..గెలుపొందింది. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక 25 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికే కీలక ప్లేయర్లు శనక 45 పరుగులు, మెండిస్ 60 పరుగుల చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణరత్నె 16 పరుగులు చేశాడు. 19వ ఓవర్లలో రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ అంతా బంగ్లాదేశ్ వైపు తిరిగింది. చివరి ఓవరులో 8 పరుగులు అవసరంగా కాగా..తొలి రెండు బంతుల్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్‌పై లంక పట్టు సాధించింది. ఆ తర్వాత బంతిని బంగ్లా బౌలర్ మహెది హసన్ నోబాల్ వేశాడు. రెండు పరుగులు వచ్చాయి. దీంతో లంక జట్టు విజయం ఖాయమైంది.
What a view
Nagin Dance 🐍 🐍 By Chamika karunaratne #AsiaCupT20 #BANVSSL @ChamikaKaru29 pic.twitter.com/47yxsHLelL— Sumit Raj (@Iam_SUMITRAJ) September 1, 2022
බංගලියන් පැරදූ ශ්රී ලංකාව සුපිරි කණ්ඩායම් 4 තරග වටයටhttps://t.co/7jK0H8SrXV
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 2, 2022
Also read:Weather Updates: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:Chandrababu: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయబోతున్నాయా..చంద్రబాబు ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి