AUS vs NZ: మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఆసీస్ జట్టు 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐతే రెండో మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈమ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఆలస్యంగా వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు చూసి నవ్వుకుంటున్నారు. వీడియోకు కామెంట్లు సైతం ఇస్తున్నారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఔటైయ్యాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ మైదానంలోకి వచ్చాడు. ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డారు. మిచెల్ స్టార్క్ వేసిన బంతిని విలియమ్సన్ కవర్స్‌లోకి ఆడాడు. అటువైపు ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండా రన్‌కు వచ్చాడు. అప్పటికి ఫీల్డర్ అబాట్‌కు బంతి దొరకలేదు.
ఈసమయంలోనే ఇద్దరు ఆటగాళ్లు నాన్ స్ట్రైక్ వైపు పరుగులు తీశారు. అప్పటికీ ఆస్ట్రేలియా ప్లేయర్ అబాట్ బంతిని అందుకోలేకపోయాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు గమ్మత్తుగా స్టైకింగ్ ఎండ్ వైపు పరుగులు పెట్టారు. బంతిని అందుకున్న కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టలేకపోయాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తృటిలో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. ఈమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 195 పరుగులు చేసింది.
స్టీవ్ స్మిత్ 61 పరుగులతో అలరించాడు. మ్యాక్స్‌వెల్ 25 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివర్లో మిచెల్ స్టార్క్ 38, హాజిల్‌వుడ్ 23 పరుగులు చేయడంతో 150 పరుగుల మార్క్‌ను ఆస్ట్రేలియా దాటింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు చేశారు. మూడో వన్డే ఈనెల 11న జరగనుంది.
Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD
— cricket.com.au (@cricketcomau) September 8, 2022
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..రాగల మూడురోజులపాటు వానలే వానలు..!
Also read:Bandi Sanjay: 4వ విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి