Steve Smith says Last Time BCCI served us a green top pitches: ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. సిరీస్ డిసైడర్ మ్యాచ్ బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ ముగియగానే.. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు నేడు భారత్ బయల్దేరింది. బెంగళూరులోని ఆలూరులో ఆసీస్ ప్లేయర్స్ సన్నాహకాలు మొదలుపెట్టనున్నారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2023కి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత పర్యటనలో బీసీసీఐ తమని మోసం చేసిందని, ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడను అని అన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గ్రీన్ టాప్ వికెట్ రూపొందించిందని, అసలు మ్యాచ్‌లకు మాత్రం స్పిన్ వికెట్ తయారు చేసి తమని పక్కదారి పట్టించిందని చెప్పాడు. భారత పర్యటనకు ముందు సిడ్నీలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొన్నామని, స్పిన్ వికెట్‌పై భారీగా సాధన చేశామని స్మిత్ పేర్కొన్నాడు.
భారత్ ఫ్లైట్ ఎక్కేముందు డైలీ టెలిగ్రాఫ్‌తో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'సాధారణంగా ఏ పర్యటనకు వెళ్లినా ఆస్ట్రేలియా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌లో కూడా రెండు టూర్ గేమ్‌లు ఆడాం. అయితే ఈసారి భారతదేశంలో మాత్రం టూర్ గేమ్ ప్లాన్ చేయలేదు. చివరిసారి మేము భారత్ వచ్చినప్పుడు గ్రీన్ టాప్ వికెట్ రూపొందించారు. మేము స్పిన్‌ను ఎదుర్కోలేదు. అసలు మ్యాచ్‌లకు మాత్రం స్పిన్ వికెట్ తయారు చేసి ఆసీస్ టీమ్‌ను తప్పుదోవ పట్టించించారు. అందుకే భారత్‌లో ప్రాక్టీస్ గేమ్ ఆడకుండా మేం సరైన నిర్ణయం తీసుకున్నాం' అని అన్నాడు.
'సిడ్నీ వేదికగానే స్పిన్ ట్రాక్ తయారు చేసుకొని మ్యాచ్ ఆడాం. అందరూ బాగా ప్రాక్టీస్ చేశారు. భారత్‌తో బోర్డర్ గవాస్కర్ 2023 సిరీస్ ఆడేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. భారత్‌లో మేం టెస్ట్ సిరీస్ గెలిచి చాలా రోజులు అవుతోంది. నేను రెండు సార్లు ఇక్క టెస్ట్ సిరీస్ ఆడాను. ఉపఖండ పిచ్‌లపై ఆడటం కష్టం. సవాళ్లకు మా జట్టు సిద్దంగా ఉంది' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు. 2004 నుంచి ఆస్ట్రేలియా భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను ఓడించలేదు. గత పర్యటనలో స్మిత్ 71.28 సగటుతో 499 పరుగులు చేశాడు.
Also Read: Upcoming Cars 2023: ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు.. చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.