T20 World Cup 2022: అందరూ ఉహించినట్టే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి బూమ్రా స్థానంలో ఎవర్ని ఎంపిక చేసింది..
అనుకున్నట్టే జరిగింది. టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన ఇండియన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వెన్నుగాయంతో బాధపడుతున్న బూమ్రాను బీసీసీఐ మెడికల్ బృందం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నా..బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. వైద్యుల నివేదికతో బూమ్రా వైదొలగాడని బీసీసీఐ తెలిపింది.
జస్ప్రీత్ బూమ్రా స్థానంలో ఎవరు
జస్ప్రీత్ బూమ్రా స్థానంలో బీసీసీఐ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇప్పటికే 15 మంది సభ్యులతో టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బై ప్లేయర్లుగా వెల్లడించింది. స్టాండ్ బై ప్లేయర్లలో మొహమ్మద్ షమీ, చహర్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్షోయ్లు ఉన్నారు. బూమ్రా పేసర్ కావడంతో దీపక్ చహర్ లేదా మొహమ్మద్ షమీలలో ఒకరు ఎంపిక కావచ్చు.
మరోవైపు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా బరిలో ఉన్నాడు. ఇప్పటికే సిరాజ్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్‌ను కూడా టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా పంపిస్తున్నారు. మరోవైపు కుల్దీప్ సేన్, ముఖేష్ చౌదరి, చేతన్ సకారియాలు కూడా నెట్ బౌలర్లుగా ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. తుది జట్టులో ఎవరెవరు ఆడతారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also read: ICC T20 WC 2022: వరల్డ్ టాప్-5 టీ20 ప్లేయర్లను ప్రకటించిన గిల్‌క్రిస్ట్..చోటు ఎవరెవరికీ దక్కిదంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook