PAK vs SL Highlights: రఫ్ ఆడించిన రిజ్వాన్.. కొండంత లక్ష్యాన్ని ఊదేసిన పాకిస్థాన్.. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపు..

PAK vs SL Highlights: ప్రపంచకప్‍లో పాకిస్థాన్ తన దూకుడు చూపిస్తోంది. శ్రీలంక నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని కూడా సునాయసంగా ఛేదించి రెండో విజయాన్ని అందుకుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 11:26 PM IST
PAK vs SL Highlights: రఫ్ ఆడించిన రిజ్వాన్.. కొండంత లక్ష్యాన్ని ఊదేసిన పాకిస్థాన్.. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపు..

ODI World Cup, PAK vs SL: వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తన జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శ్రీలంక ఇచ్చిన భారీ టార్గెట్‍ను 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి పాక్ చరిత్ర సృష్టించింది. 48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన రికార్డును ఆ జట్టు సొంతం చేసుకుంది. 

ఇవాళ హైదరాబాద్‍ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ పెరీర్ డకౌట్ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ నిసాంకకు జత కలిసిన కుశాల్‌ మెండీస్‌ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాప్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిసాంక ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ కుశాల్ అండతో రెచ్చిపోయాడు. వీరిద్దరూ పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ఈ క్రమంలో మెండీస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సమరవిక్రమ కూడా 89 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా తక్కువ స్కోర్లకే వెనుదిరిగడంతో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి చేసింది. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ నాలుగు వికెట్లు తీశాడు. 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ కు మెుదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇమామ్‌ ఉల్‌ హక్‌ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ కూడా ఎంత సేపు క్రీజులో నిలబడలేదు. పది పరుగులకే అతడు పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ కు తోడైన మహ్మాద్ రిజ్వాన్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం షఫీక్ ఔటయ్యాడు.  సౌద్‌ షకీల్‌ (31), ఇఫ్తిఖర్‌ అహ్మద్‌ అండతో పాకిస్థాన్ విజయాన్ని అందించాడు రిజ్వాన్. రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: ENG vs BAN Highlights: సెంచరీతో చెలరేగిన మలన్.. బంగ్లాదేశ్‍పై ఇంగ్లండ్ ఘన విజయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News