India vs England Women, 3rd ODI Highlights: భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ ను 3-0తో వైట్ వాష్ చేసి...ఝులన్ గోస్వామికి (jhulan goswami) ఘనంగా వీడ్కోలు పలికింది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత అమ్మాయిలు 16 పరుగుల తేడాతో విజయం సాధించారు.
మెుదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల రాణించడంతో 169 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లులో స్మృతి మందాన (50), దీప్తి శర్మ (68) మాత్రమే రాణించారు. అనంతరం ఛేధనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రేణుకా సింగ్ ఇంగ్లాండ్ బ్యాటర్ల భరతం పట్టింది. అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చింది. చివరి మ్యాచ్ ఆడుతున్న ఝులన్ సైతం 2 వికెట్లు తీయడం విశేషం. ఇంగ్లాండ్ జట్టులో ఛార్లొట్లే డీన్ మాత్రమే 47 పరుగుల చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది.
A LEGEND. AN INSPIRATION.
A remarkable 20-year career draws to a close!
Take a bow, @JhulanG10 🙌🏻 pic.twitter.com/cfnYu4nuFC
— ICC (@ICC) September 24, 2022
ఝులన్‌కు విజయంతో వీడ్కోలు..
టీమిండియా సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి సుదీర్ఘ కెరీర్ కు స్వస్తి పలికింది. రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఝులన్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందించింది. చివరగా లార్డ్ లో తన కెరీర్ ను ముగించింది. 2002లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది ఝులన్. ఈమె తన కెరీర్ లో ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడింది. వన్డే ఫార్మట్ లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది గోస్వామి.
Also Read: MS Dhoni: రేపు సోషల్ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook