Kapil Dev on Kohli: బీసీసీఐ వర్సెస్ విరాట్ కోహ్లీ వివాదంపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. కోహ్లీ, గంగూలీలు ఇద్దరూ ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రయపడగా..బీసీసీఐకు సర్వాధికారాలుంటాయని కపిల్ దేవ్ అంటున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ..బీసీసీఐపై(BCCI) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశంలో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు తనకెవరూ చెప్పలేదని..కనీసం టీ20 బాథ్యతల్ని తప్పుకోమని కూడా ఎవరూ సూచించలేదని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల్ని బీసీసీఐ తోసిపుచ్చింది. ఛీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ..విరాట్ కోహ్లీతో కెప్టెన్సీ గురించి ముందుగానే చర్చించాడని బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ చేసి వ్యాఖ్యలతో వివాదం మరికాస్త పెరిగింది. దాంతో ఈ వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించాడు. గంగూలీ, విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ఒకదానికొకటి సంబంధం లేదని..ఇద్దరూ ముందుకొచ్చి స్పష్టత ఇస్తేనే వివాదం సమసిపోతుందని చెప్పాడు.
ఇప్పుడు తాజాగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ప్రముఖ బౌలర్ కపిల్ దేవ్(Kapil Dev)మరోలా స్పందించాడు. జట్టు కెప్టెన్సీను నిర్ణయించే అధికారం సెలెక్టర్లకు ఉంటుందని..వారు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. కోహ్లీ ఆడినంతగా క్రికెట్ సెలెక్టర్లు ఆడి ఉండకపోవచ్చని..కానీ కెప్టెన్సీ నిర్ణయించే పూర్తి అధికారం సెలెక్టర్లదేనని చెప్పాడు. కెప్టెన్సీపై తీసుకునే నిర్ణయాల్ని సెలెక్టర్లు కోహ్లీకే కాదు మరెవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు కపిల్ దేవ్. మరోవైపు ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం చేయవద్దని కోరుతున్నారు. జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. ఈ సూచన కేవలం విరాట్ కోహ్లీకే(Virat Kohli)కాదని..టీమ్ ఇండియా ఆటగాళ్లందరికీ వర్తిస్తుందంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి