ICC World Cup 2023: ఒకప్పుడు మేటి జట్టుగా ఉన్న శ్రీలంక ఇప్పుడు అతికష్టంతో ప్రపంచకప్ 2023లో ఎదురీదుతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న టీమ్ ఇండియాను శ్రీలంక నిలువరించగలుగుతుందా అనేది ఆసక్తిగా మారింది. గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లనుండటంతో టీమ్ ఇండియాకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్.
ఐసీసీ ప్రపంచకప్ 2023లో శ్రీలంక పరిస్థితి చాలా ఘోరంగానే ఉందని చెప్పాలి. అసలు ప్రపంచకప్‌కు అర్హత పొందిందే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా. ఆ తరువాత ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 2 మ్యాచ్ లే గెలిచింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా శ్రీలంక సెమీస్ ఆశలు ఏమాత్రం మెరుగుపడే పరిస్థితి లేదు గానీ పరువు నిలబెట్టుకునే అవకాశముంది. అందుకే శ్రీలంక పూర్తిగా శ్రమించాల్సి వస్తుంది. వరుసగా శ్రీలంకలోని కీలక ఆటగాళ్లకు గాయాలు వెంటాడుతున్నాయి. అనూహ్యంగా టీమ్‌లో చేరిన మాథ్యూస్‌పై జట్టు పూర్తి ఆశలు పెట్టుకుంది. ఇక బౌలింగ్ పరంగా రజిత, తీక్షణ, మధుశంకలు టీమ్ ఇండియా బ్యాటర్లను ఏ మేరకు నిలువరించగలరో చూడాలి.
ఇక టీమ్ ఇండియా తుది జట్టులో మార్పులు లేకపోవచ్చు. హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, సూర్య కుమార్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు. అయితే పిచ్ స్వభావం కూడా అలాంటిదే. బౌలర్లు మాత్రం చెలరేగిపోయారు. ఐదుగురు బౌలర్లతో టీమ్ ఇండియా రంగంలో దిగనుంది.
ముంబైలోని వాంఖేడ్ పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలమైంది. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదటి బ్యాటింగ్ ఎంచుకుంటుంది. ఈ పిచ్‌పై ఈ టోర్నీలో జరిగిన రెండు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అత్యధికంగా 399, 382 పరుగులు సాధించింది. పూర్తిగా బ్యాటింగ్ అనుకూల పిచ్ కావడంతో టీమ్ ఇండియా బ్యాటర్లు పరుగుల వర్షం కురిపిస్తారని అంచనాలున్నాయి.
Also read: SA vs NZ World Cup 2023: వరల్డ్‌కప్‌లో భారీ విజయం.. సఫారీ చేతిలో కివీస్ ఘోర ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook