IND vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలిన భారత్.. ఆసీస్‌కు ఈజీ టార్గెట్

IND vs AUS 3rd Test Day 2 Highlights: మూడో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్టస్థితిలో నిలిచింది. నాథన్ లైయన్ 8 వికెట్లతో చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ పరుగులకే కుప్పకూలింది. భారత్ 163 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఆసీస్‌ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యం ఉంది. భారత్ బ్యాట్స్‌మెన్ మరోసారి మూకుమ్మడివగా విఫలమయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 07:06 PM IST
IND vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలిన భారత్.. ఆసీస్‌కు ఈజీ టార్గెట్

IND vs AUS 3rd Test Day 2 Highlights: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియాకు ఆసీస్ బ్రేక్ వేసింది. మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కుప్పకూలిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూ జట్టు విజయానికి చేరువలో నిలిచింది. రెండోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. 163 పరుగులు మాత్రమే చేసింది. చతేశ్వర్ పుజారా అత్యధికంగా 59 పరుగులు చేయగా.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ మరో 76 పరుగులు చేస్తే.. విజయం సాధిస్తుంది. 

ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆట ప్రారంభించే సమయానికి.. ఆ జట్టు చాలా త్వరగా కుప్పకూలుతుందని ఎవరూ ఊహించలేదు. 186 పరుగుల వద్ద పీటర్ హ్యాండ్స్‌కాంబ్ వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి అశ్విన్, ఉమేష్ కంగారూ జట్టు పని పట్టారు. దీంతో ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ 197 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు తరఫున జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్ తలో మూడు వికెట్లు తీశారు. లంచ్ సమయానికి తొలి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.

లంచ్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభమైన వెంటనే శుభ్‌మన్ గిల్ (5) రూపంలో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12), విరాట్ కోహ్లీ (13) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. టీ సమయానికి ముందు రవీంద్ర జడేజాను నాథన్ లియాన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపి భారత్‌ను మళ్లీ దెబ్బ తీశాడు. రెండో సెషన్ ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 79 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్‌లో పుజారా ఒంటరి పోరాటం చేశాడు.

చివరి సెషన్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కాస్త సానుకూలంగా ఆడటంతో  జట్టు పటిష్టతకు కృషి చేస్తారని అందరూ భావించారు. శ్రేయాస్ అయ్యర్ మంచి సపోర్ట్ చేయడంతో కోలుకున్నట్లే అనిపించినా.. 26 పరుగుల వద్ద అతను ఔట్ అవ్వడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. పుజారా (59) మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. చివరకు అక్షర్ పటేల్ (15) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కంగారూ జట్టులో నాథన్ లియాన్ ఒక్కడే 8 వికెట్లు తీయగా.. మాథ్యూ కుహ్నెమన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. అద్భుతం జరిగితే తప్పా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం కష్టమే.

Also Read: Rahul Sipligunj Naatu Inspirational: పాతబస్తీ కుర్రోడు ఆస్కార్లో లైవ్ పెర్ఫార్మెన్స్.. ఇది కదా ఇన్స్పిరేషన్ అంటే!

Also Read: Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News