Virat Kohli: మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. మూడో టెస్టులో 77 పరుగులు చేస్తే..

IND vs AUS 3rd Test: రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. టీమిండియా రన్‌ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ.. మరో 77 పరుగులు చేస్తే టెస్టుల్లో తన మరో రికార్డు సొంతం చేసుకుంటాడు. ఇంతకు ఆ రికార్డు ఏమిటి..? కోహ్లీ 77 పరుగులు చేస్తే ఎవరి సరసన చేరతాడు..?   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 10:49 PM IST
Virat Kohli: మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. మూడో టెస్టులో 77 పరుగులు చేస్తే..

IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలవడంతోపాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెడుతోంది. రెండు టెస్టుల్లో టీమిండియా వరుసగా విజయాలు సాధించినా.. ఇంకా అనేక సమస్యలు జట్టును వెంటాడుతున్నాయి. బౌలర్లపై భారంతో భారత్ నెట్టుకోస్తోంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, జడేజా, అక్షర్ పటేల్ మినహా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో చెలరేగుతాడని భావించిన విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. 

మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 77 పరుగులు చేస్తే.. స్వదేశంలో నాలుగు వేల పరుగులు చేసుకుంటాడు. 
భారత్‌లో ఇప్పటివరకు 48 మ్యాచ్‌లు ఆడాడు. 74 ఇన్నింగ్స్‌లలో 59.43 సగటుతో 3923 పరుగులు చేశాడు. ఇండోర్ టెస్టులో 4 వేల టెస్టు పరుగులు పూర్తి చేసే సువర్ణావకాశం లభించింది. భారత్‌లో విరాట్ ఇప్పటివరకు 13 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. 

కోహ్లి కంటే ముందు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ముందున్నారు. భారత గడ్డపై టెస్టు క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 7216 రన్స్‌తో మొదటిస్థానంలో ఉండగా.. 5598 పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ 5067 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 4656 రన్స్ చేశారు.  

వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా డీలా పడిపోయింది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో భారత విజయం నమోదు సాధిస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 64.06 విజయాల శాతంతో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 66.67 విజయాల శాతంతో నంబర్‌వన్‌లో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. 

Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?  

Also Read: Rythu Bharosa-PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్‌లోకి డబ్బులు జమ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News