India vs New Zealand 2nd Test Full Highlights: భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 245 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్పిన్నర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసిపోయింది. 1955-56 తర్వాత సొంతగడ్డపై భారత్‌ను ఓడించి కివీస్ సిరీస్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో 68 ఏళ్ల తర్వాత టీమిండియా దారుణ పరాభవం ఎదుర్కొంది. చివరగా 2012-13 సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. మళ్లీ ఇప్పుడు కివీస్ చేతిలో ఓటమిపాలైంది.
Also Read: YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు దిమ్మతిరిగేలా.. కీలక నేతను రంగంలోకి దింపిన జగన్..!
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. కాన్వే (76), రచిన్ రవీంద్ర (65), శాంట్నర్ (33) రాణించారు. వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో మెరిశాడు. బదులుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 156 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (38) యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) పర్వాలేదనిపించారు. శాంట్నర్ 7 వికెట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్.. 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లాథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్), బ్లుండెల్ (41) రాణించారు. వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (8) వికెట్ కోల్పోయింది. ఆ తరువాత యశస్వి జైస్వాల్ (77), శుభ్‌మన్ గిల్ (23) దూకుడుతో కాస్త కోలుకున్నట్లే కనిపించింది. రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే గిల్‌ను శాంట్నర్ ఔట్ చేశాడు. మరో 30 పరుగుల వ్యవధిలో జైస్వాల్‌ను కూడా పెవిలియన్‌కు పంపించాడు. కాసేటికే చక్కటి త్రోతో రిషబ్ పంత్ (0) రనౌట్ చేశాడు.
విరాట్ కోహ్లీ (17) కూడా శాంట్నర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్యూ రూపంలో వెనుతిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ (9), వాషింగ్టన్ సుందర్ (21), రవిచంద్రన్ అశ్విన్ (18), ఆకాశ్‌దీప్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. చివర్లో రవీంద్ర జడేజా (42) పోరాడినా అప్పటికే భారత్ ఓటమి ఖరారు అయింది. శాంట్నర్ ఆరు వికెట్ల తీయగా.. అజాజ్ పటేల్ 2, ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter