IND Vs PAK World Cup 2023: పాక్ క్రీడా మంత్రి షాకింగ్ కామెంట్స్.. చిరకాల ప్రత్యర్థి పర్యటనపై సస్పెన్స్

Pakistan Sports Minister On Ind Vs Pak Match: వరల్డ్ కప్‌లో పాక్ జట్టు పాల్గొనడంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆసియా కప్ ఆడేందుకు తమ దేశానికి వస్తేనే.. పాక్ జట్టు వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వెళుతుందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 9, 2023, 05:23 PM IST
IND Vs PAK World Cup 2023: పాక్ క్రీడా మంత్రి షాకింగ్ కామెంట్స్.. చిరకాల ప్రత్యర్థి పర్యటనపై సస్పెన్స్

Pakistan Sports Minister On Ind Vs Pak Match: భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ రాగా.. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం పది జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే అందరి కళ్లు మాత్రం అక్టోబర్ 15న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు రెడీగా ఉన్నారు. అయితే పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టడంపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలు వరల్డ్ కప్‌లో దయాది జట్టు పాల్గొంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో పాక్ క్రీడా మంత్రి ఎహ్సాన్ మజారీ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆసియా కప్ కోసం టీమిండియా తటస్థ వేదికను డిమాండ్ చేస్తే.. తాము ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లబోమని స్పష్టం చేశారు. అయితే తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందన్నారు. ఆసియా కప్‌లో భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడాలని డిమాండ్ చేస్తే.. ప్రపంచ కప్‌ను తాము కూడా అదే డిమాండ్ చేస్తామన్నారు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ రాకపోతే.. తమ దేశం కూడా ప్రపంచకప్ నుంచి వైదొలుగుతుందన్నారు. అహ్మదాబాద్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే అందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటించడంపై విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దయాది జట్టు భారత్‌కు రావాలా..? వద్దా..? అనే ఈ కమిటీ నిర్ణయించనుంది. అయతే ఈ కమిటీలో ఎహ్సాన్ మజారీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిటీకి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తారని.. ఈ కమిటీ సభ్యులుగా ఉన్న 11 మంది మంత్రుల్లో తాను ఒకడిని అని మజారీ తెలిపారు. 

తమ కమిటీ అన్ని విషయాలను అధ్యయనం చేసి ప్రధానికి నివేదిక అందజేస్తుందన్నారు. ఇక ఆసియా కప్ 2023 కోసం హైబ్రిడ్ మోడల్‌కు తాను మద్దతు ఇవ్వడం లేదని స్ఫష్టం చేశారు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి.. అన్ని మ్యాచ్‌లను నిర్వహించే హక్కు ఉందన్నారు. క్రికెట్ ప్రేమికులందరూ కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. తమకు హైబ్రిడ్ మోడల్ అక్కర్లేదన్నారు. భారత్ క్రీడలను రాజకీయాల్లోకి తీసుకువస్తుందని.. టీమిండియాను తమ దేశానికి ఎందుకు పంపకూడదని అనుకుంటుందో తనకు అర్థం కావడంలేదన్నారు. కొద్దికాలం కింద భారత్ బేస్‌బాల్ టీమ్ ఇస్లామాబాద్‌లో ఆడేందుకు వచ్చిందని.. తాను ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యానని చెప్పారు. పాకిస్థాన్ ఫుట్‌బాల్ హాకీ, చెస్ జట్లు కూడా భారత్‌లో పర్యటించాయని గుర్తుచేశారు. 

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  

Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News