India Vs South Africa Highlights World Cup 2023: వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. అన్ని టాప్ జట్లను మట్టికరిపించి జోరు మీదు ఉన్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించి.. విజయ పరంపర కొనసాగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ (121) సెంచరీతో కదం తొక్కగా.. శ్రేయాస్ అయ్యర్ (77) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 327 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు 83 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టాడు. షమీ, కుల్దీప్ చెరో 2, సిరాజ్ ఒక వికెట్ తీసి.. సఫారీ పతనాన్ని శాసించారు. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో టీమిండియా టాప్ ప్లేస్‌తో సెమీస్ ఆడనుంది. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది.
327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. గత మ్యాచ్‌ల్లగానే క్రీజ్‌లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వరుస సెంచరీలతో చెలరేగుతూ సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) ఆరంభంలోనే ఔట్ చేసి సిరాజ్ తొలి దెబ్బ తీశాడు. కాసేపటికే కెప్టెన్ బవుమా (11)ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఆ తరువాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (13), ఐడెన్ మార్క్రామ్ (8), హెన్రిచ్ క్లాసెన్ (1), డేవిడ్ మిల్లర్ (11) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో సఫారీ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. ఈ టోర్నీలో అన్ని జట్లను బ్యాటింగ్‌తో భయపెటిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు ముందు మాత్రం కుప్పకూలిపోయింది. టెయిలండర్లను కూడా త్వరగా పెవిలియన్‌కు పంపించడంతో సఫారీ 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది.
అంతుకుముందు టాస్ గెలిచిన భారత్‌కు టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ (40) మరోసారి వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (23)ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 93 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ (87 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 22, 5 ఫోర్లు), రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్, 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడారు.
Also Read: Bjp-Janasena: తెలంగాణలో కుదిరిన పొత్తు, జనసేనకు 9 సీట్లు, ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్
Also Read: Dust Allergy: డస్ట్ అలర్జీ బాధిస్తోందా..? అయితే ఈ ఐదు రకాల టిప్స్‌ను ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook