ఇండియా vs విండీస్ : కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్

                

Last Updated : Oct 12, 2018, 12:37 PM IST
ఇండియా vs విండీస్ : కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్

హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పైచేయి సాధించే దిశగా కనిపిస్తోంది. ఆదిలో నిలకడగా ఆడుతూ కనిపించిన విండీస్ ను అనూహ్యంగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉదయం టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్ జట్టు..తొలి సెషన్ లో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించింది. అయితే కులదీప్ స్పిన్ మాయాజాలానికి ఓపెనర్  క్రైగ్ బ్రాత్ వైట్ (14) ఎల్బీడబ్బ్యూ రూపంలో వెనుదిరగడంతో విండీస్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. మరో ఓపెనర్  కేరన్ పావెల్  (22 )ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. వచ్చి రావడంతోనే పదునైన షాట్లతో అదగొట్టిన షై హోప్ (36) టీమిండియా ఫేసర్ ఉమేష్ యాదవ్ వేసిన పదునైన బంతికి తలొగ్గి ఎల్బీడబ్బ్యూ రూపంలో వెనుదిరిగాడు .

ప్రస్తుతం గెట్మైర్ (10) పరుగులు ఆమ్మిస్ (0) క్రీజులో ఉన్నారు. ఇదే తరహా టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టినట్టయితే సాయంత్రాని కల్లా విండీస్ పై పట్టుబిగించే అవకాశముందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News