IPL 2021: 6 బంతుల్లో 6 ఫోర్లు బాదడంపై DC ఓపెనర్ Prithvi Shaw గేమ్ ప్లాన్ చెప్పేశాడు

IPL 2021 Prithvi Shaw : ప్రత్యర్థి జట్టు స్టార్ బౌలర్లను సైతం బెంబెలెత్తిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలలో అధిక భాగం ఓపెనర్లు సాధించిన పరుగులతో సాధ్యమయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా శివాలెత్తిపోయాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2021, 10:20 AM IST
  • ఐపీఎల్ 2021లో సత్తాచాటుతున్న డీసీ ఓపెనర్ పృథ్వీ షా
  • గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లో 6 ఫోర్లు బాదిన షా
  • తన గేమ్ ప్లాన్ ఏంటి, ఆ ఫోర్ల సీక్రెట్ వెల్లడించిన యువ సంచలనం
IPL 2021: 6 బంతుల్లో 6 ఫోర్లు బాదడంపై DC ఓపెనర్ Prithvi Shaw గేమ్ ప్లాన్ చెప్పేశాడు

IPL 2021 Prithvi Shaw టీమిండియా యువ సంచలనం పృథ్వీ షా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థి జట్టు స్టార్ బౌలర్లను సైతం బెంబెలెత్తిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలలో అధిక భాగం ఓపెనర్లు సాధించిన పరుగులతో సాధ్యమయ్యాయి. ఓవైపు షా, మరోవైపు శిఖర్ ధావన్ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా శివాలెత్తిపోయాడు. మొత్తం 41 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 82 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం రాణించడంతో కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. అయితే తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో షా కొట్టిన ఆరు బౌండరీలు అపురూపమే. కేకేఆర్ పేసర్ శివం మావి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 6 బంతులను ఫోర్లుగా మలిచి కేకేఆర్‌పై ఒత్తిడి పెంచాడు.

Also Read: IPL 2021: MS Dhoniకి గుడ్ న్యూస్, కరోనా నుంచి కోలుకున్న CSK కెప్టెన్ తల్లిదండ్రులు

మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ.. ‘వాస్తవానికి ఇలా ఆడాలి అని నేను ప్లాన్ చేసుకోలేదు. చెత్త బంతులు పడితే వదలకూడదని నిర్ణయించుకున్నాను శివం మావితో కలిసి నాలుగైదేళ్లు క్రికెట్ ఆడిన అనుభవం నాకు ఉంది. తొలి నాలుగు బంతులు హాఫ్ వ్యాలీ వేశాడు. నేనేమో షార్ట్ బాల్ కోసం ఎదురుచూశాను. ఒకవేళ స్పిన్నర్ బౌలింగ్ అయితే బంతి బ్యాట్ మీదకు రాదు. పేసర్ కావడంతో నా పని తేలిక అయింది. ఆఫ్ స్టంప్, ఆఫ్ స్టంప్ వెలుపలకు బంతులు వేస్తే నాకు షాట్లు కొట్టడం తేలిక అవుతుంది. నేను నా స్కోరు గురించి ఏమాత్రం పట్టించుకోను. కేవలం చెత్త బంతులను బౌండరీలకు తరలించడం నా పని’ అంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో 21 ఏళ్ల పృథ్వీ షా వెల్లడించాడు.

Also Read: IPL 2021: Pat Cummins ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్తాడా, క్లారిటీ ఇచ్చిన ఆల్ రౌండర్

తన జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నాయని అయితే కష్టకాలంలో తన తండ్రి మద్దతు మరువలేనిదని చెప్పాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి వచ్చాక, సహజసిద్ధమైన గేమ్ ఆడాలని తన తండ్రి ఇచ్చిన సలహాను పాటిస్తున్నట్లు తెలిపాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కలిశారా, ఆయనతో మాట్లాడారా అని మీడియా ప్రశ్నించగా.. లేదు, ఇప్పటివరకూ ఆ అవకాశం రాలేదు. కానీ అవకాశం వస్తే ఎప్పటికైనా కలిసి మాట్లాడతాను. ఎందుకంటే తొలి బంతికే పరుగులు రాబట్టాలని భావించే బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అని షా తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News