SRH vs LSG Live: ఈ టాటా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన ప్రదర్శనలు చేస్తూ యావత్ జట్ల ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంటోంది. తాజాగా లక్నో సూపర్ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ తడాఖా చూపించింది. సమష్టి ప్రదర్శనతో 62 బంతులు మిగిలిండగానే 10 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. ముంబై మ్యాచ్‌లో నిరాశపర్చిన హైదరాబాద్ సొంత మైదానం ఉప్పల్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చింది. పవర్ ప్లేలోనే కాదు సాధారణ ఓవర్లలోనూ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ బీభత్సం సృష్టించడంతో హైదరాబాద్ అభిమానులకే కాదు క్రికెట్ ప్రేమికులకు చక్కటి వినోదం అందింది.
Also Read: LSG vs KKR Highlights: లక్నోకు ఘోర పరాభవం.. సునీల్ నరైన్ విధ్వంసంతో కోల్‌కత్తాకు భారీ విజయం
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. పవర్ ప్లే మొదలుకుని ఆఖరి బంతి వరకు అతి కష్టంగా పరుగులు చేశారు. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆయూష్ బదోని (55) అర్ధ శతకం సాధించగా.. నికోలస్ పూరన్ (48) త్రుటిలో కోల్పోయాడు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (29) పర్వాలేదనిపించాడు. క్వింటాన్ డికాక్ (2), మార్కస్ స్టోయినిస్ (3) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కృనాల్ పాండ్యా (24) కొన్ని పరుగులు చేశాడు. లక్నోను పరుగులు చేయకుండా హైదరాబాద్ బౌలర్లు పకడ్బందీగా బంతులు వేశారు. పవర్ ప్లే నుంచే పదునైన బౌలింగ్ వేయడంతో లక్నో అతి తక్కువ స్కోర్‌కు పరిమితమైంది. భువనేశ్వర్ రెండు కీలకమైన వికెట్లు తీసి ఎల్‌ఎస్‌జీని చావుదెబ్బ తీశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా తక్కువ పరుగులు ఇచ్చి స్కోర్‌ను నియంత్రించారు.
నిన్న గాలివాన.. నేడు బ్యాటర్ల సునామీ
స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్ అంటూ ఊదేసింది. ఒక్క వికెట్ పడకుండానే 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను చుట్టేసి 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. సొంత మైదానం ఉప్పల్‌లో మరోసారి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తడాఖా చూపించారు. పవర్ ప్లేలోనే వంద పరుగులు దాటించారంటే మరోసారి వారి జోడి ఏరకంగా ఆడిందో తెలుసుకోవచ్చు. ఒక్క పరుగు లేకుండా మొత్తం ఫోర్లు, సిక్సర్లతోనే హెడ్ అర్థ శతకం సాధించడం గమనార్హం. 30 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. యువ ఆటగాడు అభిషేక్ కూడా తగ్గేదేలే అన్నాడు. 28 బంతుల్లోనే 75 పరుగులు చేసి ప్రేక్షకులను ఊపేశాడు. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో రెచ్చిపోయి ఆడాడు. అంతకుముందు గాలివాన బీభత్సం సృష్టించగా బుధవారం మాత్రం హైదరాబాద్ బ్యాటర్లు పరుగులతో బీభత్సం సృష్టించారు.
అతి తక్కువ స్కోర్ ఉన్నా కూడా లక్నో సూపర్ జియాంట్స్ బౌలర్లు కాపాడలేకపోయారు. ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయారు. నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్‌లను కూడా జాలి లేకుండా హైదరాబాద్ బ్యాటర్లు చెలిరేగిపోయారు. అత్యధికంగా యశ్ ఠాకూర్ 47 పరుగులు ఇవ్వగా.. నవీన్ 37 సమర్పించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ లక్నో మెప్పించలేక ఓటమి వైపు నిలిచింది.
పాయింట్ల పట్టికలో..
ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తన రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకుంది. మైనస్ నుంచి ఏకంగా ౦.406 నెట్ రన్‌రేట్‌ను సొంతం చేసుకుంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఏడింటిని కైవసం చేసుకుని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. లక్నో 12 మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి ఆరో స్థానంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter