IPL Retention: రిటైన్‌లో ఐపీఎల్‌ జట్లు సంచలనం.. అట్టి పెట్టుకున్న ప్లేయర్ల జాబితా ఇదే!

IPL Retention Players Full List Check Out: రిటైన్‌ గడువు ముగియడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 31, 2024, 06:08 PM IST
IPL Retention: రిటైన్‌లో ఐపీఎల్‌ జట్లు సంచలనం.. అట్టి పెట్టుకున్న ప్లేయర్ల జాబితా ఇదే!

IPL Retention Players: క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా నిలిచిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. తమ వద్ద అంటిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించేందుకు గురువారంతో ముగిసింది. ఆఖరి రోజు ఐపీఎల్‌ జట్లు తాము రిటైన్‌ చేసుకుంటున్న ఆటగాళ్ల పేర్లను విడుదల చేశాయి. తమ జట్టుకు ప్రధాన బలంగా ఉన్న ఆటగాళ్లను తమ వద్ద అంటిపెట్టుకుని.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న వారిని జట్టు యాజమాన్యాలు త్యజించాయి.

Also Read: IPL Retain: మొత్తం 10 జట్లు రిటైన్‌ చేసుకున్న ప్లేయర్లు వీరే! ఏ జట్టు ఎవరినో తెలుసా?

ఒక్కో జట్టు ఆరుగురి ప్లేయర్లను అంటిపెట్టుకునే అవకాశం ఉంది. రానున్న సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న జట్లు తమ ఆటగాళ్ల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సీనియర్ ప్లేయర్‌ అయినా కూడా ప్రదర్శన ఆధారంగానే జట్లు రిటైన్‌పై ఆలోచనలు చేశాయి. ఈ సందర్భంగా ఐపీఎల్‌ జట్లు ఎవరెవరిని రిటైన్‌ చేసుకున్నాయో.. ఎవరిని వదిలేశారనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. రిటైన్‌ చేసుకునే ప్లేయర్లకు ఫ్రాంచైజీలు రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి.

Also Read: Ind vs NZ 2nd Test Highlights: ఇదేం బ్యాటింగ్ స్వామి.. ఉత్తి పుణ్యానికి సిరీస్ ఇచ్చేశారు

క్లాసెన్ భారీ ధర
రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లల్లో అత్యధికంగా ధర సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌కు దక్కింది. రూ.23 కోట్లు చెల్లించి సన్‌రైజర్స్‌ క్లాసెన్‌ను ఒడిసిపట్టుకుంది. అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లు వదలకుండా అట్టి పెట్టుకుంది. ఆయా జట్ల కెప్టెన్లుగా ఉన్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ను జట్లు వదులుకున్నాయి. ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో వారు మెగా వేలంలో పోటీపడనున్నారు.

రిటైన్‌ ప్లేయర్ల జాబితా ఇదే!
సన్‌రైజర్స్ హైదరాబాద్:
పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), నితీశ్‌ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌(రూ.18 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), మతీష పతిరణ (రూ.13 కోట్లు), శివమ్‌ దుబే (రూ.12 కోట్లు), మహేంద్ర సింగ్‌ ధోనీ (రూ.4 కోట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), ఆండ్రె రసెల్‌ (రూ.12 కోట్లు), హర్షిత్‌ రాణా (రూ.4 కోట్లు) రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు)
గుజరాత్ టైటాన్స్: రశీద్ ఖాన్(రూ.18 కోట్లు), శుభమన్ గిల్ (రూ.16.5 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారూక్ ఖాన్ (రూ.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధృవ్ జురెల్ (రూ.14 కోట్లు), షిమ్రోన్ హెట్మెయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), మొహసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు)
పంజాబ్ కింగ్స్: శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు)
ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు), రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు),

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x