Rajasthan Royals Spinner Ajit Chandila: ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న క్రికెటర్ అజిత్ చండీలాకు ఊరట లభించింది. ఈ కేసులో అజిత్ చండీలాకు శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ.. బీసీసీఐ అంబుడ్స్‌మెన్ వినీత్ శరణ్ నిర్ణయం తీసుకున్నారు. 2013లో జరిగిన ఐపీఎల్‌లో అంకిత్ చవాన్, శ్రీశాంత్, అజిత్ చండీలాలపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ముగ్గురు ఆటగాళ్లకు శిక్ష పడింది. ఆ తరువాత 2020లో శ్రీశాంత్, అంకిత్ చవాన్‌పై నిషేధాన్ని ఎత్తివేయగా.. తాజాగా అజిత్ చండీలాకు కూడా రిలీఫ్ లభించింది.
అప్పుడు ఏం జరిగింది..?
ఐపీఎల్ 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్స్ంగ్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బుకీ నుంచి చండీలా 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులకు కేసు నమోదు చేశారు. అయితే బుకీ చెప్పినట్లు చేయనందుకు రూ.20 లక్షలు తిరిగి ఇచ్చేడని.. మరో 5 లక్షల రూపాయలు తరువాత ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని అప్పట్లో సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ.. మిగిలిన ఇద్దరితోపాటు చండీలాపై కూడా జీవిత కాల నిషేధాన్ని విధించింది. అయితే డబ్బులు తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు కోర్టులో నిరూపించలేకపోయారు. చండీలాకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.
కోర్టు నుంచి క్లీన్ చీట్ రావడంతో తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అంకిత్ చండీలా బీసీసీఐ అంబుడ్స్‌మెన్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. చండీలా అభ్యర్థనను పరిశీలించిన అంబుడ్స్‌మెన్ వినీత్.. తాజాగా నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2013 మే నెల నుంచి క్రికెట్ గ్రౌండ్‌కు దూరమైన చండీలా.. ఎట్టకేలకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు అనుమతి లభించింది. అతని నిషేధ కాలాన్ని 2016 నుంచి తీసుకోవడంతో ఏడేళ్ల శిక్ష కాలం ముగిసిపోయింది. నిషేధం ఎత్తివేయసిన తరువాత శ్రీశాంత్ క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టాడు. చవాన్ ముంబైలోని క్లబ్ జట్టు తరుఫున బరిలోకి దిగాడు. ఇప్పుడు అజిత్ చండీలా కూడా మరోసారి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.
అజిత్ చండీలా ఐపీఎల్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. 6.21 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్‌లో 2 మ్యాచ్‌లు ఆడగా.. 9 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కూడా లభించింది. ఇందులో మొత్తం 10 వికెట్లు తీశాడు. చండీలాకు ఇప్పుడు 39 ఏళ్లు. ఐపీఎల్ ఐదో సీజన్‌లో హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశాడు.
Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి