Rajasthan Royals vs Delhi Capitals Playing 11: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ తుది జతుత్లో రెండు మార్పులు చేసింది.
ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ ఒకదాంట్లో విజయం సాధించి, ఇంకో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ రెండింట్లోనూ ఓటమి పాలై.. గెలుపు కోసం చూస్తోంది. రాజస్థాన్‌పై సత్తాచాటి వార్నర్ సేన ఖాతా తెరుస్తుందో? లేదో? చూడాలి.
భారీ స్కోరు మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఇంపాక్ట్ రూల్ వల్ల బ్యాటింగ్, బౌలింగ్‌ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామన్నాడు. జోస్ బట్లర్ బాగానే ఉన్నాడు అని తెలిపాడు. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తామని ఢిల్లీ కెప్టెన్ వార్నర్ చెప్పాడు. మిచెల్ మార్ష్ వివాహం చేసుకునేందుకు వెళ్లాడని, అతడికి శుభాకాంక్షలు చెబుతున్నా అని వార్నర్ పేర్కొన్నాడు.
తుది జట్లు:
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్.
ఢిల్లీ: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్ పాండే, రిలీ రొసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (కీపర్), అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and choose to bowl first against @rajasthanroyals
Follow the match ▶️ https://t.co/FLjLINwjU4#TATAIPL | #RRvDC pic.twitter.com/MroMUzMZrX
— IndianPremierLeague (@IPL) April 8, 2023
సబ్‌స్టిట్యూట్‌లు:
రాజస్థాన్: నవ్‌దీప్ సైని, అకాశ్ వశిష్ఠ్, మురుగన్ అశ్విన్, కేఎం అసిఫ్, డొనవన్ ఫెరీరా.
ఢిల్లీ: అమన్ హకీమ్ ఖాన్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దూబే.
Also Read: MI vs CSK Dream11 Team: ఐపీఎల్ టాప్ జట్లు ముంబై, చెన్నై మధ్య బిగ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.