LSG vs GT Updates: అన్నదమ్ముల మధ్య బిగ్‌ఫైట్.. టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇలా..

Lucknow Super Giants vs Gujarat Titans Playing 11 and Dream11: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..     

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2023, 04:00 PM IST
LSG vs GT Updates: అన్నదమ్ముల మధ్య బిగ్‌ఫైట్.. టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇలా..

Lucknow Super Giants vs Gujarat Titans Playing 11 and Dream11: పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌పై లక్నో సూపర్ జెయింట్స్ కన్నేసింది. నేడు గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి అగ్రస్థానానికి దూసుకెళ్లాని చూస్తోంది. ప్రస్తుతం 8 పాయింట్లో లక్నో రెండోస్థానంలో ఉండగా.. ఆరు పాయింట్లతో గుజరాత్ నాలుగో ప్లేస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రెండు జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. యూపీలోని ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంతగడ్డపై లక్నో మొదట బౌలింగ్ చేయనుంది. అన్నదమ్ములు హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారనుంది.

రెండు జట్లు బలంగా ఉండడంతో తుది జట్లలో పెద్దగా మార్పులు చేయలేదు. గుజరాత్ టైటాన్స్ తరుపున నూర్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. 'ముందుగా బ్యాటింగ్ చేస్తాం. స్లో ట్రాక్‌గా కనిపిస్తోంది. పిచ్ నుంచి బ్యాట్స్‌మెన్లకు సహకరించే అవకాశం ఉంది. మా బ్యాటర్లను పరీక్షించడానికి ఇప్పుడు సమయం లేదు. టాస్ గెలిస్తే వారు కూడా ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవారని నేను అనుకుంటున్నాను. ఈ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడమే బెటర్ ఆప్షన్ అని నా అభిప్రాయం. ఛేజింగ్ చేస్తున్నప్పుడు మా రికార్డ్ గురించి మేము బాధపడట్లేదు. అల్జారీ జోసఫ్‌ స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు..' అని హార్ధిక్ పాండ్యా తెలిపాడు.

మేం మొదట బ్యాటింగ్ గురించి ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడతాం. ఎస్‌ఆర్‌హెచ్‌పై ఛేజింగ్ చేసి గెలిచాం. గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి.. టార్గెట్‌ను ఛేజ్ చేయాలని అనుకుంటున్నాం. యుధ్వీర్ స్థానంలో అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చాడు. చివరి గేమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు..' అని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

Also Read: MI Vs PBKS Dream 11 Prediction: రోహిత్ సేన దూకుడుకు పంజాబ్ బ్రేక్ వేసేనా..? డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్ ఇవే..  

 

 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్ ఉల్- క్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

Also Read: Repo Rate 2023: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో వడ్డీ రేట్లు తగ్గింపు..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News