Dattajirao Gaekwad dies: టీమిండియా లెజండరీ క్రికెటర్ కన్నుమూత

Dattajirao Gaekwad: బరోడా లెజండ్, టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూశారు. ఆయన మృతికి మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 04:50 PM IST
Dattajirao Gaekwad dies: టీమిండియా లెజండరీ క్రికెటర్ కన్నుమూత

Dattajirao Gaekwad dies at 95: భారత క్రికెట్‌ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్‌ (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఫిబ్రవరి 13) బరోడా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చనిపోయేంత వరకు దేశంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ ఆయనే కావడం విశేషం. 

బరోడాకు చెందిన గైక్వాడ్‌ 1952 నుంచి 1961 వరకు భారత జట్టుకు సేవలందించాడు. టీమిండియా  తరఫున 11 టెస్టులు ఆడిన గైక్వా్  350 పరుగులు చేశారు. ఇందులో వెస్టిండీస్ పై చేసిన అర్థ సెంచరీ కూడా ఉంది. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించిఉన్న సారథిగా రికార్డు సొంతం చేసుకున్నారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు గైక్వాడ్‌.. అక్కడ టీమిండియాకు సారథిగా వ్యవహరించాడు. దత్తాజీరావు మరణం పట్ల బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. గైక్వాడ్ కుమారుడు అన్షుమాన్ కూడా టీమిండియా తరపున 40 టెస్ట్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు మరియు 90లలో జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు.

ఫస్ట్ క్లాస్ లో అద్భుతమైన రికార్డు
నేషనల్ టీమ్ లో తనదైన ముద్ర వేయకపోయినా గైక్వాడ్.. దేశవాళీలో మాత్రం పరుగుల వరద పారించారు.  110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 17 సెంచరీలతో 5,788 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రంజీల్లో ఇతడి అత్యధిక స్కోరు 249. ఇతడు మూడు  డబుల్ సెంచరీలు చేయడంతోపాటు బౌలింగ్ లో 25 వికెట్లు కూడా పడగొట్టాడు.  కెప్టెన్‌గా 1957-58 సీజన్‌లో బరోడాకు రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించారు. 

Also Read: Saurabh Tiwari Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన చోటా ధోని!

Also Read: Ind vs Eng 03rd Test: టీమిండియాకు బిగ్ షాక్.. రాజ్ కోట్ టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News