Saurabh Tiwari Retirement: టీమిండియా సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం సౌరభ్ రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఆడుతున్నాడు. ఈ నెల 15 నుంచి రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ అతడి కెరీర్ లో చివరిది. ఈ మ్యాచ్ ఆనంతరం తివారీ తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు. గతంలో ధోనిలాగే ఇతడు పొడవాటి జట్టుతో భారీ హిట్టింగ్ తో విరుచుకుపడేవాడు. పైగా ఇతడిది కూడా జార్ఖండ్. అందుకే సౌరభ్ ను జులపాల ధోని, చోటా ధోని పిలిచేవారు.
'వారికి అవకాశమిచ్చేందుకే రిటైర్మెంట్' ..
రిటైర్మెంట్ ప్రకటించిన సౌరభ్ తివారీ.. జంషెడ్‌పూర్‌లోని కీనన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు ప్రసంగంలో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. పాఠశాల విద్యకు ముందు ప్రారంభించిన ఈ ప్రయాణానికి వీడ్కోలు పలకడం కాస్త కష్టమే. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ పోటీలో లేనప్పుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. యువ ఆటగాళ్ల అవకాశాలను కాలరాయడం సరికాదు’ అని ఈ సందర్భంగా సౌరభ్ పేర్కొన్నాడు. గత కొంత కాలంగా ఇతడు భుజం నొప్పితో బాధపడుతున్నాడు.
క్రికెట్ ప్రస్థానం..
సౌరభ్ తివారీ 2010లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మూడు వన్డేలు మాత్రమే ఆడిన సౌరభ్ రెండు ఇన్నింగ్స్‌లలో 49 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 37 పరుగుల నాటౌట్. అయితే తివారీకి ఫస్ట్ క్రికెట్ లో అద్భుతమైన రికార్డు ఉంది. 11 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించిన తివారీ ఇప్పటివరకు 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో అతను 47.51 సగటుతో 8030 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఇతడు ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, డేర్‌డెవిల్స్ తరపున ఆడాడు. మొత్తం 93 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సౌరబ్ 28.73 సగటుతో మరియు 120.1 స్ట్రైక్ రేట్‌తో 1494 పరుగులు చేశాడు.
Also Read: World Cup: చిన్న కప్పును కూడా తన్నుకుపోయిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో భారత్‌కు నిరాశ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook