ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తారక్

ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేది నుంచి ఐపిఎల్ 2018 పదకొండవ సీజ‌న్ ప్రారంభ‌కానుంది.

Last Updated : Mar 28, 2018, 06:24 AM IST
ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తారక్

ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేది నుంచి ఐపిఎల్ 2018 పదకొండవ సీజ‌న్ ప్రారంభ‌కానుంది. ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రసార హ‌క్కుల‌ను స్టార్ గ్రూప్ (స్టార్ స్పోర్స్ట్) ఐదేళ్లపాటు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే..! దీంతో స్టార్ గ్రూప్ ప‌లు భాష‌ల‌కు చెందిన సినీ ప్రముఖుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పదకొండో సీజన్ ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తారక్‌ను నియమించుకుంది. ఈ సందర్భంగా స్టార్ గ్రూప్ త్వరలో ఎన్టీఆర్‌తో మ్యాచ్‌లకు సంబంధించి ప్రోమోలు షూట్ చేసి.. లీగ్ ఆరంభానికి ముందు వీటిని విడుదల చేయనుంది. స్టార్  గ్రూప్‌కు చెందిన ఓ తెలుగు ఛానెల్‌లో వాటిని సీజన్ ముగిసేవరకు ప్రసారం చేయనున్నారు. గ‌తంలో ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 1కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో ఆ షోకి టాప్ టిఆర్‌పి రేటింగ్ ద‌క్కింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తారక్‌ను ఐపిఎల్ సీజ‌న్ 11కు బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది స్టార్ గ్రూప్. ఐపీఎల్ 2018 స్టార్ గ్రూప్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ సంతకం చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని దసరా 2018లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతి 2019న విడుదల చేయనుంది చిత్ర యూనిట్.  నందమూరి ఫ్యామిలీలోని ఓ నటుడితో త్రివిక్రమ్ సినిమా చేయడం ఇదే తొలిసారి.  హరీకాహాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రానుంది.

Trending News