అయ్యయ్యో నా అరుదైన రికార్డు పోయిందే.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను ఎగతాళి చేసిన దక్షిణాఫ్రికా పేసర్!

IND vs ENG: Robin Peterson trolls Stuart Broad. స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒకే ఓవర్లో 29 పరుగులు (మొత్తంగా 35) ఇవ్వడంతో రాబిన్ పీటర్సన్ పేరుపై ఉన్న రికార్డు చెరిగిపోయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 09:41 PM IST
  • అయ్యయ్యో నా అరుదైన రికార్డు పోయిందే
  • బ్రాడ్‌ను ఎగతాళి చేసిన దక్షిణాఫ్రికా పేసర్
  • ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు
అయ్యయ్యో నా అరుదైన రికార్డు పోయిందే.. స్టువర్ట్‌ బ్రాడ్‌ను ఎగతాళి చేసిన దక్షిణాఫ్రికా పేసర్!

Robin Peterson trolls Stuart Broad: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒకే ఓవర్లో భారీగా పరుగులు సమర్పించున్నాడు. 84 ఓవర్‌ వేసిన బ్రాడ్‌.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాటికి ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 పరుగులు వచ్చాయి. దాంతో టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. 

అంతకుముందు టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు దక్షిణాఫ్రికా పేసర్ రాబిన్ పీటర్సన్ పేరుపై ఉండేది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా.. పీటర్సన్ వేసిన ఓ ఓవర్లో 28 పరుగులు చేశాడు. పీటర్సన్ వేసిన ఓవర్లో లారా 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు రాబట్టాడు. దాంతో టెస్టులో అత్యంత చెత్త రికార్డు పీటర్సన్ పేరుపై లిఖించబడింది. 

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో స్టువర్ట్‌ బ్రాడ్‌కు జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు. బ్రాడ్‌ వేసిన 84 ఓవర్ తొలి బంతికి బుమ్రా బౌండరీ బాదాడు. రెండో బంతికి వైడ్ ప్లస్ ఫోర్‌ వచింది. ఆపై నో బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి బౌండరీ బాదాడు. అంటే ఒక్క బంతికే ఏకంగా 15 రన్స్ వచ్చాయి. ఇక 3, 4 బంతులను బుమ్రా బౌండరీకి బాదాడు. ఐదవ బంతిని సిక్సర్‌గా బాధగా.. చివరి బంతికి సింగల్ వచ్చింది. మొత్తంగా ఈ ఓవర్లో 35 రన్స్ వచ్చాయి. 

స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒకే ఓవర్లో 29 పరుగులు (మొత్తంగా 35) ఇవ్వడంతో రాబిన్ పీటర్సన్ పేరుపై ఉన్న రికార్డు చెరిగిపోయింది. ఈ విసయమై పీటర్సన్ ట్వీట్ చేస్తూ బ్రాడ్‌ను సరదాగా ఎగతాళి చేశాడు. 'ఈ రోజు నా ఆరుడైన రికార్డును కోల్పోవడం బాధాకరంగా ఉంది. రికార్డులు బద్ధలవ్వడం  సహజం' అంటూ పీటర్సన్ ట్వీటాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Kiara Advani Pics: పొట్టి డ్రెస్సులో కియారా అద్వానీ.. గ్లామర్ షో మాములుగా లేదు!

Also Read: టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్‌ దేవ్‌, ఎంఎస్ ధోనీ తర్వాత..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News