Chris Morris: రాజస్థాన్ కు షాకిచ్చిన క్రిస్ మోరిస్... రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ఆటగాడు

Chris Morris: దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్​కు గుడ్​ బై చెప్పాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్​ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 04:32 PM IST
  • దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్న క్రిస్ మోరిస్
  • దేశవాళీ టీ20 జట్టుకు కోచ్​ బాధ్యతలు స్వీకరణ!
Chris Morris: రాజస్థాన్ కు షాకిచ్చిన క్రిస్ మోరిస్... రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ఆటగాడు

Chris Morris Retirement: దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్​కు రిటైర్మెంట్ (Chris Morris Retirement) ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్ కు ముగింపు పలికాడు. దేశవాళీ టీ20 జట్టు 'టైటాన్స్'కు కోచ్ (Titans Coach)​ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్​స్టా గ్రామ్​ వేదికగా వెల్లడించాడు. 

మోరిస్ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు (South Africa) ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నమెంట్‌లో అతను దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో ప్రోటీస్ తరుపున 69 మ్యాచ్ లు ఆడిన అతను 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్ లో అతను టీ20ల్లో ఆరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. 

Also Read:IPL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!

2016లో టెస్టు క్రికెట్​లో (Test Cricket) అరంగేట్రం చేశాడు మోరిస్. అనంతరం ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులే ఆడి 173 పరుగులు చేశాడు. 12 వికెట్లు పడగొట్టాడు. 42 వన్డేల్లో 48 వికెట్లు, 23 టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు మోరిస్. బ్యాటింగ్​ విషయానికొస్తే.. వన్డేల్లో 467 పరుగులు, టీ20ల్లో 133 పరుగులు చేశాడు. ఐపీఎల్​లో క్రిస్​ మోరిస్.. రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, చెన్నై సూపర్​ కింగ్స్ జట్లలో ఆడాడు. గత ఐపీఎల్​ మెగా వేలంలో మోరిస్​ను అత్యధికంగా రూ. 16.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్​ జట్టు (Rajasthan Royals).

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News