కర్ణాటక రాష్ట్ర సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరు పార్టీలు చెరొక 30 నెలలు అధికారం చేపట్టే అవకాశముందని వస్తున్న వార్తలను కుమారస్వామి ఖండించారు.
కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది
బీజేపీ నేత సదానంద గౌడ ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని.. ఆఖరికి వారు పాకిస్తానుకి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని సదానంద గౌడ అన్నారు.
నా రాజకీయ బలం చూసి ప్రధాని నరేంద్రమోదీ భయపడుతున్నారని, అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. సోమవారం బెంగళూరు నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ- "ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రాజభోగాలు కల్పించారని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూసి అసహనంతో ఆయన ఈ ఆరోపణ చేసి ఉండవచ్చు. ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇందుకు ఇటీవల జరిగిన నంజన్గుడ్, గుండ్లుపేట్ ఎన్నికలే నిదర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.