కర్ణాటక వార్: ప్రొటెం స్పీకరులో మార్పు లేదు.. బలపరీక్ష లైవ్ టెలికాస్ట్

కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది

Last Updated : May 19, 2018, 12:07 PM IST
కర్ణాటక వార్: ప్రొటెం స్పీకరులో మార్పు లేదు.. బలపరీక్ష లైవ్ టెలికాస్ట్

కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది. ప్రొటెం స్పీకరుగా ఎవరిని నియమించాలో, నియమించరాదో అన్నది చట్టం తేల్చకూడదని అభిప్రాయపడింది. అందుకే  ప్రస్తుతం ఉన్న వ్యక్తే స్పీకరుగా కొనసాగుతారని తెలిపింది.

అయితే కాంగ్రెస్‌-జేడీఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రొటెం స్పీకరు విశ్వాస పరీక్షను నిర్వహించడాన్ని తప్పుపట్టారు. కానీ చట్టం ఈ విషయంలో జోక్యం చేసుకోదని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇదే విషయంలో స్పీకరుకి నోటిసులు పంపి.. బలపరీక్షను వాయిదా వేయించే పని అయితే కోర్టు చేయగలదని తెలిపింది.

కనుక.. ప్రొటెమ్ స్పీకరు ఎన్నిక అనేది కోర్టు పరిధిలో లేని విషయం కాబట్టి.. ముందు సూచించిన విధంగానే బోపయ్య ప్రొటెం స్పీకరుగా వ్యవహరిస్తారని.. అలాగే సాయంత్రం 4 గంటలలకు బలపరీక్ష జరిగి తీరుతుందని తెలిపింది. అలాగే గతంలో కాంగ్రెస్ సూచించినట్లు జరిగే తతంగమంతా లైవ్ టెలికాస్ట్ అవుతుందని ప్రకటించింది.

Trending News