Best Power Bank: అతి తక్కువ ధరకే 10000 Mah, 20000 Mah ప్రీమియం ఫీచర్స్ పవర్ బ్యాంక్స్..ధర వివరాలు ఇవే..

Cheap And Best Power Bank: అతి తక్కువ ధరలోనే మంచి పవర్ బ్యాంక్స్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.?  అయితే మీకోసం ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Urbn బ్రాండ్ కి సంబంధించిన పవర్ బ్యాంకులను తీసుకువచ్చాం. ఇవి ప్రస్తుతం రెండు వేరియన్స్ లో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోని లభించడంతో ఎక్కువగా యువత కొనుగోలు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2023, 10:40 PM IST
Best Power Bank: అతి తక్కువ ధరకే 10000 Mah, 20000 Mah ప్రీమియం ఫీచర్స్ పవర్ బ్యాంక్స్..ధర వివరాలు ఇవే..

 

Cheap And Best Power Bank: ప్రస్తుతం మార్కెట్లో పవర్ బ్యాంకులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మినీ పవర్ బ్యాంకులను మొదలుకొని పెద్ద సైజు పవర్ బ్యాంకుల వరకు చాలా టెక్ కంపెనీలు మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని బ్రాండ్లకు సంబంధించిన పవర్ బ్యాంక్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది యువత ఎక్కువగా ఫీచర్లు కలిగిన తక్కువ ధరలో లభించే పవర్ బ్యాంకులను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలోని మంచి పవర్ బ్యాంకు ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చాం. 

ప్రముఖ ఛార్జింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ Urbnకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అతి తక్కువ ధరలోని లభించడంతో చాలామంది కొనుగోలు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు సంబంధించిన పవర్ బ్యాంకుల తయారీని కంపెనీ దేశమంతా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఈ పవర్ బ్యాంక్ రెండు విభిన్న (10,000mAh, 20,000mAh) సామర్థ్యాలతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు కలర్ వేరియంట్ లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ పవర్ బ్యాంకు కు సంబంధించిన బ్లాక్ ఎడిషన్ మార్కెట్లో ఎక్కువ అమ్ముడు అవుతోంది. ఈ పవర్ బ్యాంకుతో ఒక్కసారి 30 నిమిషాల పాటు చాట్ చేస్తే దాదాపు 50 శాతం వరకు చార్జ్ అవుతుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ప్రస్తుతం ఈ పవర్ బ్యాంక్ విభిన్న ధరల్లో అందుబాటులో ఉంది. పవర్ బ్యాంక్ సామర్థ్యాన్ని బట్టి మార్కెట్లో వివిధ రేట్లతో కంపెనీ విక్రయిస్తోంది. మొదట 10,000mAh సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంకు విషయానికి వస్తే..అర్బన్ నానో పవర్ టెక్నాలజీ కలిగిన ఈ పవర్ బ్యాంక్ మార్కెట్లో రూ.1,649లో అందుబాటులో ఉంది. ఇక 20,000mAh బ్యాటరీ యూనిట్‌తో కూడిన రెండవ మోడల్ ధర రూ.2,499లకు లభిస్తోంది. అయితే ఈ రెండు సామర్ధ్యాలతో కూడిన పవర్ బ్యాంక్ అమెజాన్ తో పాటు క్రోమా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.

అర్బన్ నానో పవర్ బ్యాంక్ బ్లాక్, కామో, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. దీంతోపాటు ఈ పవర్ బ్యాంకులపై రీప్లేస్మెంట్ వారంటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు పవర్ బ్యాంక్ మోడల్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పాటు ఐ ఫోన్స్ టాబ్లెట్స్ ఇయర్ బడ్స్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయగలవు. 10,000 mAh నానో పవర్ బ్యాంక్ ను ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. అయితే 20,000 mAh వేరియంట్ ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుందని కంపెనీ వెల్లడించింది. ఇతర పవర్ బ్యాంకులతో పోలిస్తే సగం సమయంలోనే ఈ పవర్ బ్యాంకులు ఛార్జ్ అవుతాయి.

Urbn నానో పవర్ బ్యాంక్ ఫీచర్లు:
22.5W వరకు ఛార్జింగ్ సపోర్ట్‌
20,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాకప్‌
USB-C పోర్ట్‌లు
ట్రిపుల్ పోర్ట్ డిజైన్
పాస్-త్రూ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News