Citroen C3 Aircross Safety Rating: నేటికాలంలో కస్టమర్ తెలివితేటల్లో ముందున్నాడు. ముఖ్యంగా డబ్బు విలువ బాగా తెలుసుకున్నాడు. కాబట్టి ఏదైనా డబ్బు పెట్టుబడి పెట్టాలంటే దాని గురించి కచ్చితంగా ఆలోచిస్తున్నాడు. నేటికాలం కార్ మార్కెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కస్టమర్లు ధరనే కాదు సేఫ్టీ విషయంలోనూ సురక్షితంగా ఉండే కార్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బహుశా గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు పెరగడానికి కారణం ఇదే. ఎందుకంటే టాటా మోటార్స్ భద్రతపై పని చేసింది. కానీ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఈ విషయంలో వెనుకబడింది. ఈ కంపెనీ భారతీయ కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. అందుకే కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ భద్రతలో ఘోరంగా విఫలం:
సిట్రోయెన్ భారత కార్ మార్కెట్‌లో తన పట్టును నెలకొల్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ కంపెనీ ఇంకా సక్సెస్ అందుకోలేదు. క్రాష్ టెస్ట్‌లో సిట్రోయెన్ కారు ఘోరంగా విఫలమైంది.సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌కు గురైంది. ఈ కారులో 33.01% స్కోర్, పిల్లలకు 11.37% స్కోర్ లభించింది. దీని కారణంగా ఈ కారుకు జీరో రేటింగ్ లభించింది. ఈ రేటింగ్ తర్వాత, కంపెనీ ఈ కారు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే నేటి కాలంలో, కస్టమర్ కారులో భద్రతా రేటింగ్‌ను చూసిన తర్వాత కారును కొనుగోలు చేస్తున్నారు కస్టమర్లు.
ఇది చదవండి: Kavya Maran: ఐపీఎల్ వేలంలో కావ్య మారన్‌కు భారీ షాక్.. శాపంగా మారిన ఆర్‌టీఎం కార్డు
ధర, వేరియంట్లు:
Citroen C3 Aircross ధర రూ. 8.49 లక్షల నుండి రూ. 14.55 లక్షల వరకు ఉంది. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ 5 సీట్ల ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ దేశవ్యాప్తంగా రూ.12.85 లక్షలుగా ఉంచింది. కొత్త వేరియంట్ క్యాబిన్‌లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. SUV ప్రామాణిక మోడల్ ఫీచర్లను మాత్రమే పొందింది. ఈ కారు ఫీచర్లు, ఇంజన్ గురించి తెలుసుకుందాం.
ఇది చదవండి: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో రికార్డ్ ధర 26.75 కోట్లు పలికిన శ్రేయస్
ఇంజిన్, ఫీచర్లు:
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది మాన్యువల్ వేరియంట్, ఆటోమేటిక్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ SUV మాన్యువల్ వేరియంట్ 109bhp పవర్ 190Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో కూడిన వేరియంట్ 109 బిహెచ్‌పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు Apple CarPlay, Android Auto, 7-అంగుళాల TFT క్లస్టర్, USB ఛార్జర్, AC వెంట్లను దాని 3వ వరుసలో కలిగి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.