Whatsapp Stickers Feature: నేటి కాలంలో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించని వారంటూ ఎవరూ లేరు. ప్రతిఒక్కరు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తారు అందులో ముఖ్యంగా వాట్సాప్‌ను ఎల్లప్పడు ఉపయోగిస్తారు. వాట్సాప్ ప్రపంచంలోనే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఇది 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో 180 దేశాలలో ఉపయోగించబడుతోంది.
అయితే వాట్సాప్‌లో మనం తరుచు కొత్త కొత్త ఫీచర్స్ ను ఉపయోగిస్తాము. అయితే ముఖ్యంగా మన ఫ్రెండ్స్‌తో స్టిక్కర్‌ని ఉపయోగించి మెసేజ్ చేస్తాము. ఈ స్టిక్కర్స్ ఎంతో అద్బుతంగా ఉంటాయి. అయితే మీకు ఈ విషయం తెలుసా. ఇప్పుడు మనం మనకు నచ్చిన ఫోటోను స్టిక్కర్‌గా మార్చుకోని మన ఫ్రెండ్స్ , ఇతర స్నేహితులతో చాట్ చేయవచ్చు.
మరి మన ఫోటోలతో ఎలా స్టిక్కర్‌ను తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం:
ఈ స్టిక్కర్స్ కోసం ముందుగా మీరు మీ కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయాలి. అనంతరం "చాట్స్" ట్యాబ్ కి వెళ్లండి. తరువాత కుడి వైపులో ఉన్న మూడు చుక్కల మెనూ ను నొక్కండి. అక్కడ "Sticker" ఎంచుకోండి. ఇప్పడు "New" ట్యాబ్ కి వెళ్లండి. ఇందులో "From Photo" ఎంచుకోండి. మీరు స్టిక్కర్ గా మార్చాలనుకుంటున్న ఫోటో ను ఎంచుకోండి. ఇప్పుడు ఫోటో ను కత్తిరించండి. మీరు ఫోటో యొక్క పరిమాణం, స్థానంను ఎంచుకోవచ్చు. ఆ తరువాత "Next" నొక్కండి. మీ స్టిక్కర్ ప్యాక్ కి ఒక పేరును ఇవ్వండి. చివరిగా "Save" నొక్కండి. ఇప్పడు మీ స్టిక్కర్ ప్యాక్ తయారు అయింది. దీని మీరు మీ చాట్స్ లో ఉపయోగించడం ప్రారంభించవచ్చు.
ఈ స్టిక్కర్ అనేది యాపిల్ ఫోన్‌లో కూడా తయారు చేసుకోవచ్చు. దీని ఉపయోగించి మీ కుటుంబం, ఫ్రెండ్స్‌తో సరదగా చాట్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ స్టిక్కర్‌ను తయారు చేసుకోండి ఇలా.
Disclaimer: ఈ వెబ్‌సైట్/యాప్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఈ సమాచారం నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు మరియు మీ ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలి.
Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter