Redmi Note 13 Pro Price: గుడ్‌ న్యూస్‌.. Note 13 Pro కొత్త వేరియంట్‌ రూ.6,000కే..

Redmi Note 13 Pro 5G Price Cut: రెడ్‌మీ Note 13 Pro 5G స్కార్లెట్ రెడ్ కలర్‌ వేరియంట్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 4, 2024, 01:40 PM IST
Redmi Note 13 Pro Price: గుడ్‌ న్యూస్‌.. Note 13 Pro కొత్త వేరియంట్‌ రూ.6,000కే..

Redmi Note 13 Pro 5G Price Cut: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి కొత్త వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీనిని కంపెనీ గతంలో లాంచ్‌ చేసిన Redmi Note 13 Pro 5G మొబైల్‌ను ఆప్డేట్‌గా స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎంతో ఆకర్శనీయంగా కనిపించేందుకు రెడ్‌ కలర్ ఆప్షన్‌లో వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్‌ లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ రూ.6,000కే లభిస్తోంది. గతంలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ అనే కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్కౌంట్‌ పూర్తి వివరాలు:
ఈ స్కార్లెట్ రెడ్ కలర్‌ను కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌ ధర వివరాల్లోకి వెళితే, 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మోడల్ ధర రూ. 24,999తో లభిస్తోంది. 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ICICI, HDFC, SBI, Axis, Kotak Bank క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్‌ చేస్తే రూ.3 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. 

దీంతో పాటు ఈ Redmi Note 13 Pro 5G స్కార్లెట్ రెడ్ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే, ఎక్చేంజ్‌ చేయాలనుకునేవారు పాత Xiaomi కంపెనీకి సంబంధించిన మొబైల్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.6,000కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఆకర్శనీయమైన EMI ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.   

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Redmi Note 13 Pro 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే
1220x2712 పిక్సెల్స్‌ రిజల్యూషన్
1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌
Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ 
200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్
2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
 5100 mAh బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
 ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News