SIP Benefits: షేర్ మార్కెట్‌లో ఎగుడు దిగుడులు ఉండటంతో అందరూ ఎస్ఐపీపై దృష్టి సారిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచ్యువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం..ఆగస్టులో ఎస్ఐపీ ఖాతాలు పెరిగి 5.71 కోట్లకు చేరుకుంది. ఆ వివరాలు మీ కోసం..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కాస్త రిస్క్‌తో కూడుకున్నదే. కానీ డైరెక్ట్ ఈక్విటీ కంటే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఫరవాలేదు. రిస్క్ తక్కువ ఉంటుంది. ఈ నేపధ్యంలో మీరు ఎస్ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్ఐపీ విధానంలో మ్యుచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు. ఎస్ఐపీ విధానంలో 100 రూపాయల్నించి కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీనివల్ల పెట్టుబడిలో రిస్క్ తక్కువ ఉంటుంది. రిటర్న్ అంచనా వేయడం సులభమౌతుంది. ఎస్ఐపీ విధానంలో పెట్టుబడి పెట్టడం వల్ల రెగ్యులర్ సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్ అలవాటుగా మారుతుంది. ఇందులో నిర్దిష్టమైన తేదీన నిర్ణయించిన నగదు జమ చేయాల్సి ఉంటుంది. ముందుగానే సిద్ధమవడం వల్ల మంచి అలవాటుగా మారుతుంది.
ఎస్ఐపీలో పెట్టుబడితో ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కౌంట్ నుంచి బ్యాంక్ ఎక్కౌంట్ లింకింగ్ అయి ఉంటుంది. ప్రీ డిసైడెడ్ ఎమౌంట్ మీ ఎక్కౌంట్ నుంచి ప్రతి నెలా ఓ తేదీన కట్ అవుతుంటుంది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి. ప్యాన్, ఆధార్ అవసరమౌతాయి. ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ సహాయంతో ఫండ్ ఎంతనేది అంచనా వేయవచ్చు. ఫండ్ పాత చరిత్రను బట్టి..రానున్న ఏళ్లలో ఎలా ఉంటుందనేది తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook